Lingamaneni Estates
-
రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నేరం బయట పడటం వల్ల శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయంతోనే రైతులను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయట పెట్టింది. ఇందుకు సంబంధించి గురువారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలు వివరాలు వెల్లడించారు. రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై 21 నిమిషాల నిడివిగల వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి. భూ దందాలో మరో కోణం క్విడ్ ప్రో కో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త లింగమనేని రమేష్ తన భార్య సుమన.. ఇతరులు ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్.వి.రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ పేర్లమీదే కాకుండా తన సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషనల్ అకడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని ఆగ్రో ప్రై వేట్ లిమిటెడ్, లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్స్, వైట్‌సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. విచిత్రంగా ఈ భూములేవీ రాజధాని నగరం పరిధిలోకిగానీ, సీఆర్డీయే పరిధిలోకి గానీ రాలేదు. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. 158 ఎకరాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, పైస్థానంలో ఉన్న వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా, వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసైన్డ్ భూముల వ్యవహారం.. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు. అధికార పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములకు ప్లాట్లు రావని ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలు చేశారు. దీనికోసం సబ్రిజిస్ట్రార్లపై అప్పటి అధికార పార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకు వచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీఓలు జారీ చేశారు. ఇలా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, వాటిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన వారిలో దాదాపు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం విశేషం. అసైన్డ్ భూములను తక్కువకు కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగు చూసింది. నారా లోకేష్ సన్నిహితుడు కొల్లి శివారం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారా లోకేష్‌కు మరో సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను చేజిక్కించుకున్నారు. ఇంకో సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరా తక్కువ ధరకు లాక్కున్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. జోన్ల అలైన్మెంట్ల కుంభకోణం.. రాజధానిలో జరిగిన మరో కుంభకోణంలో మరో కోణం ఇష్టాను సారంగా సరిహద్దులు నిర్ణయించడం. జోన్ల అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం. అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, అనుయాయుల భూము లేవీ ల్యాండ్ పూలింగ్ జోన్లోకి రాకుండా చేయడానికి సరిహద్దులను మార్చారు. 2015 జూన్‌లో రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సింగపూర్‌కు చెందిన సుర్బానాజురాంగ్‌కు డ్రాఫ్ట్ ప్లాన్ బాధ్యతలను ప్రభుత్వం అందించింది. సుర్బానాజురాంగ్ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్‌ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్ జారీ చేసి, ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టింది. జురాంగ్ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్‌కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనుక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తులను పూలింగ్ నుంచి మినహాయించి, వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం ఇక్కడ వెల్లడవుతోంది. ► మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ సమీపంలో ఉన్న రామకృష్ణా హౌసింగ్‌ను సీఆర్డీయే జోన్ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. ► చంద్రబాబు బావమరిది, నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు కంపెనీ వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు చందర్లపాడులో కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సీఆర్డీయే ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. త ద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా చేశారు. ► రాజధాని చుట్టూ నిర్మించ దలచిన ఇన్నర్ రింగురోడ్డు, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించ దలచిన రోడ్ల విషయంలోనూ అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ పేరుమీద కొనుగోలుచేసిన భూములు ఇన్నర్ రింగ్‌రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ► చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మురళీ మోహన్ కుంచనపల్లె సమీపంలో కొనుగోలు చేసిన 53.29 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగు రోడ్డు వచ్చేలా చేశారు. పక్కా ప్లాన్‌తో భూ దందా 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు అంటే రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాజధాని ప్రకటన జరిగేంత వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాజధాని ఎక్కడ రాబోతున్నదనే ముందస్తు సమాచారంతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చందర్లపాడు మండలాల్లో భూముల లావాదేవీలు చేశారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై 2014 ఆగస్టు 27న శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను పూర్తిగా పక్కన పడేశారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 25 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తూ 2014 డిసెంబర్ 30న ఏపీ సీఆర్డీయే చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రాజధాని ప్రకటన జరిగిన 2014 సెప్టెంబర్ 4లోపు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో తమ బంధువులు, బినామీల పేర్ల మీద భూములు కొనుగోలు చేశారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 4,069.91 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందారు. లంకా దినకర్ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), కంభంపాటి రామ్మోహన్రావు కుమార్తె కంభంపాటి స్వాతి , పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, అల్లుడు వడ్లమూడి శ్రీహర్ష.. వారు నడుపుతున్న ఆర్.ఆర్.ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్.. కూడా భారీగా భూములు కొనుగోలు చేశారు. (పైన పేర్కొన్న వాటికి అసైన్డ్ భూములు అదనం) రాష్ట్రం మొత్తం మీద 800 మంది తెల్లరేషన్ కార్డు దారులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 60 మంది తెల్లరేషన్ కార్డు దారులు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. చదవండి: ‘వారి బినామీలే భూములు కొనుగోలు చేశారు’ ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే రాజధాని దందా నిగ్గు తేలుస్తాం బట్టబయలైన అమరావతి కుంభకోణం ‘మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి..’ రాజధానిలో తవ్వేకొద్దీ ‘ఇన్సైడర్’ బాగోతాలు రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు వంద శాతం ఇన్సైడర్ ట్రేడింగే -
అక్రమాల గని.. ‘లింగమనేని’
సాక్షి, మంగళగిరి: లింగమనేని... ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు లేరు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా నివాసం ఉంటున్నది లింగమనేని గెస్ట్‌హౌస్‌లోనే. ఈ గెస్ట్‌హౌస్ యజమానులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ సమీపంలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఈ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చి, ప్రతిఫలంగా తమ విలువైన భూములను రాజధాని భూసమీకరణ నుంచి తప్పించేలా జాగ్రత్త పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. 1994కు ముందు విజయవాడలో చిన్నస్థాయి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసే లింగమనేని సంస్థ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, రూ.కోట్లకు పడగలెత్తిందన్న ఆరోపణలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అధికారం అండతో భూములను సొంతం చేసుకోవడంతోపాటు నిబంధనలను బేఖాతర్ చేయడం లింగమనేని సంస్థకు పరిపాటిగా మారింది. ఏసీసీ భూములతో ప్రారంభం గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడికొండ మండలాల పరిధిలోని నిడమర్రు, నంబూరు, కంతేరు, చినకాకాని, కాజా గ్రామాల్లో ఏసీసీ కంపెనీకి చెందిన 148 ఎకరాల భూములున్నాయి. గుంటూరు–విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూములపై 2001లో లింగమనేని రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను పడింది. వాటిని లింగమనేనికి విక్రయించేందుకు ఏసీసీ కంపెనీ ముందుకు రాలేదు. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అండతో లింగమనేని సంస్థ అధినేత లింగమనేని భాస్కరరావు వీజీటీఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని(ఉడా) రంగంలోకి దించారు. ప్రజావసరాల కోసం అంటూ ఏసీసీకి చెందిన భూములను ఉడా సేకరించింది. 2002లో నంబూరు గ్రామానికి చెందిన 69.81 ఎకరాలు, కాజా గ్రామానికి చెందిన 38.47 ఎకరాలు, కంతేరు గ్రామానికి చెందిన 7.63 ఎకరాలను రూ.4.90 కోట్లకు సేకరించింది. ఆ భూముల్లో జాతీయ రహదారి వెంట టౌన్షిప్ నిర్మిస్తామని పేర్కొంది. కానీ, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవే భూములను లింగమనేని సంస్థకు బహిరంగ వేలం పేరుతో విక్రయించింది. బహిరంగ వేలంలో విజయవాడకు చెందిన సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేట్ సంస్థ, గుంటూరుకు చెందిన బీఎన్కే రియల్ ఎస్టేట్ సంస్థ, లింగమనేని సంస్థ పాల్గొన్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సహారా, బీఎన్కే సంస్థలు వేలం నుంచి తప్పుకున్నాయి. చివరకు లింగమనేని సంస్థ 115.90 ఎకరాలను రూ.8.96 కోట్లకు దక్కించుకుంది. అప్పటికే ఆక్కడ ఎకరం విలువ రూ.40 లక్షలకు పైగానే పలుకుతోంది. ఉడా మాత్రం లింగమనేని సంస్థకు ఎకరా కేవలం రూ.7.75 లక్షల చొప్పున కట్టబెట్టింది. ఏసీసీకి చెందిన భూములు మొత్తం 148 ఎకరాలుండగా, ఉడా 115.90 ఎకరాలను సేకరించి, లింగమనేనికి విక్రయినట్లు చెబుతుండగా మిగిలిన 31.10 ఎకరాల భూమి ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటి విలువ ప్రస్తుతం రూ.450 కోట్ల పైమాటే. అక్రమాలను ప్రశ్నించిన గ్రామ కార్యదర్శి సస్పెండ్ ఉడా నుంచి నామమాత్రపు ధరకే విలువైన భూములను కొట్టేసిన లింగమనేని సంస్థ అప్పటి టీడీపీ సర్కారు అండతో నిబంధనలకు పాతరేసి, అందులో నిర్మాణాలను ప్రారంభించింది. కామన్ సైట్, సెట్ బ్యాక్స్ వంటి నిబంధనలను పాటించలేదు. దీనిపై నంబూరు గ్రామ కార్యదర్శి అబ్దుల్లా రియల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లింగమనేని ఒత్తిడితో సదరు గ్రామ కార్యదర్శిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి లింగమనేని అక్రమ నిర్మాణాలపై స్థానికులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా లోకాయుక్తను ఆశ్రయించారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు సాగించిన రియల్ ఎస్టేట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త 2012లో అప్పటి కలెక్టర్ సురేష్‌కుమార్‌ను ఆదేశించింది. స్పందించిన కలెక్టర్ సురేష్‌కుమార్ దీనిపై విచారణ చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన నిజమేనని తేల్చారు. లింగమనేని సంస్థపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఉడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చర్యలు తీసుకుంటున్నామని 2013లో లోకాయుక్తకు సమాధానమిచ్చిన ఉడా 2014లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ వ్యవహారాన్ని అటకెక్కించిందని ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే ఉడా సహకారంతో వందలాది ఎకరాలను లాక్కున్న లింగమనేని సంస్థ చినకాకాని, కాజా, నిడమర్రు, కంతేరు, నంబూరు గ్రామ పంచాయతీల్లో దాదాపు 1,200 ఎకరాల భూములను దక్కించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని భూ సమీకరణ నుంచి ఈ భూములను మినహాయించింది. లింగమనేని అక్రమాలపై తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నోటీసులపై స్పందించని లింగమనేని ఎక్కడున్నారు
-
లింగమనేని ఎక్కడున్నారు? : ఆర్కే
సాక్షి, అమరావతి : నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌కు నోటీసులు ఇస్తే లింగమనేని రమేశ్ ఎందుకు స్పందించటం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించాడు. లింగమనేని గెస్ట్ హౌస్‌కు నోటీసులు ఇస్తే.. పచ్చ మీడియా, టీడీపీ నేతలు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఆర్కేను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ భూములు ఇచ్చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రైతులతో కలిసి ఆర్కే ఆ భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడంపై ఇచ్చిన నోటీసులపై స్పందించని లింగమనేని ఎక్కడున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికి రోడ్డు పేరుతో అప్పటి ప్రభుత్వం రైతులను బెదిరించి భూములను తీసుకుందని విమర్శించారు. కేవలం 10 అడుగులు మాత్రమేనని చెప్పి ఒక్కొక్కరి నుంచి 20 సెంట్ల భూమిని కబ్జా చేశారని మండిపడ్డారు. భూమిని లాక్కోవడమే కాకుండా నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. రైతులకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని స్పష్టం చేశారు. భూమిని రైతులకు తిరిగి ఇస్తామని అన్నారు. -
మా భూములు తిరిగిచ్చేయండి చంద్రబాబు..
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న తమ భూములను తిరిగి ఇవ్వాలంటూ ఉండవల్లికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ భూములు ఇచ్చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి రైతులు ...ఆ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. తమది రాజన్న ప్రభుత్వమని....భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 10 అడుగులు కాస్తా... 23 అడుగులు రైతు దాసరి సాంబశివరావు మాట్లాడుతూ...చంద్రబాబు సీఎం అయ్యాక... లింగమనేని గెస్ట్‌హౌస్‌ను తమ అధికారిక నివాసంగా చేసుకున్నారని, రోడ్డు నిర్మాణం కోసం తమ వద్ద నుంచి 10 అడుగుల భూమిని తీసుకుని, సీఎం శాశ్వాత నివాసం కట్టుకున్న తర్వాత షరతు ప్రకారం పొలంలో కలిపేస్తామంటూ ఈ మేరకు అప్పటి ఆర్డీవో, ఎమ్మార్వో, గ్రామ కార్యదర్శి సంతకం చేసి ఓ పత్రాన్ని ఇచ్చారన్నారు. అయితే పది అడుగులు కాస్తా 23 అడుగులు తీసుకున్నారని రైతు సాంబశివరావు తెలిపారు. ఇదేంటని ప్రశ్నించినా...అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు దిగిపోయారని, ఒప్పందం ప్రకారం తమ భూమి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ భూమి తిరిగిచ్చేయాలని... తాము సీఆర్డీయే అధికారులు, జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. మరో రైతు బాలకోటయ్య మాట్లాడుతూ... తనకు లింగమనేని ఎస్టేట్ వద్ద 20 సెంట్లు భూమి ఉండేదని, ఆ భూమిలో లిల్లీలు, గులాబీలు పండించేవాడినని, అయితే సీఎం అధికారిక నివాసం వద్ద రోడ్డు నిర్మాణం కోసం ఆ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆ భూమి ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆ భూమిని స్వాదీనం చేసుకోవచ్చని అధికారులు అగ్రిమెంట్లో పేర్కొన్నారని.. తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. -
చంద్రబాబు ఇంటి ముందు హంగామా
సాక్షి, ఉండవల్లి : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని ఎస్టేట్‌కు సీఆర్డీఏ నోటీసులు ఇస్తే... చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేపట్టింది. టీడీపీ నేతలు మరో అడుగు ముందుకేసి... చంద్రబాబుకు సంఘీభావం తెలిపినట్లు రైతుల ముసుగులో పార్టీ కార్యకర్తలను రంగంలోకి దించారు. అక్రమ కట్టడం నుంచి చంద్రబాబును తరలిస్తే ఊరుకునేది లేదంటూ హంగామా చేశారు. చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు -
‘లింగమనేని’కి భూ విందు
సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా, నిడమర్రు, చినకాకాని.. పెదకాకాని మండలం నంబూరు.. తాడికొండ మండలం కంతేరు గ్రామాల మధ్యలో జాతీయ రహదారి పక్కనే ఉన్న డొంక రోడ్డును విజయవాడకు చెందిన లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీ అప్పనంగా కొట్టేసింది. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఉపయోగపడే ఈ రహదారిని మూసివేసి, ప్రహరీ నిర్మాణం చేపట్టింది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఏసీసీ యాజమాన్యం కింద విలువైన భూములు ఉండేవి. 2004 సంవత్సరానికి ముందే ఈ భూములు తొలుత ప్రభుత్వానికి చెందిన ‘ఉడా’కు, తర్వాత లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీ పరమయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన వివిధ సర్వే నంబర్లలో 146.68 ఎకరాల భూములుండగా, వాటిలో 115.91 ఎకరాలను ‘ఉడా’ కొనుగోలు చేసి, లింగమనేని సంస్థకు విక్రయించింది. రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం నిబంధనలకు విరుద్ధంగా డొంకదారిని కూడా విక్రయించడం గమనార్హం. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 143 సర్వే నంబర్లో దాదాపు కిలోమీటర్ పొడవున, 40 అడుగుల వెడల్పుతో ఈ రహదారి ఉంది. కంతేరు, నంబూరు గ్రామాల పొలిమేరల్లో ఉన్న ఈ డొంకరోడ్డును గతంలో రైతులు ఉపయోగించుకునేవారు. ఈ డొంకరోడ్డు విస్తీర్ణం 2.15 ఎకరాలు కాగా, 2004కు ముందు ఉడా అధికారులు లింగమనేని రియల్ ఎస్టేట్‌కు కేవలం రూ.15 లక్షలకే విక్రయించారు. లింగమనేని సంస్థ కొనుగోలు చేసిన 115.61 ఎకరాలతోపాటు 2.15 ఎకరాల డొంకరోడ్డు భూమిలో లేఔట్ వేసేందుకు ఉడా అనుమతులు ఇచ్చేసింది. దాంతో డొంక రోడ్డు చుట్టూ లింగమనేని కంపెనీ ప్రహరీ నిర్మించింది. ‘ఉడా’ ఎంతో ఉదారంగా రూ.15 లక్షలకు విక్రయించిన 2.15 ఎకరాల భూమి విలువ ఇప్పుడు అక్షరాలా రూ.30 కోట్లకు చేరడం గమనార్హం. డొంక దారి విక్రయంపై స్థానికులు కోర్టుకు వెళ్లడంతో పాటు లోకాయుక్తను సైతం ఆశ్రయించారు. డొంకదారి విక్రయంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆ రహదారిని లింగమనేని చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
లింగమనేని ఎస్టేట్ కేంద్రంగానే: తమ్మినేని
శ్రీకాకుళం : నకిలీ నాణాల మూలాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఈ వ్యవహారమంతా లింగమనేని ఎస్టేట్ కేంద్రంగా జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. నకిలీ నాణాల కేసులో రూ.20 నుంచి రూ.30 కోట్ల మేరకు డీల్ జరిగిందని తమ్మినేని తెలిపారు. శ్రీకాకుళంలో అరెస్ట్ అయిన నిందితులకు ఆ స్థాయి లేదని ఆయన అన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీకాకుళం జిల్లా రహస్య పర్యటన, ఎస్పీతో చర్చల వెనుక ఆంతర్యంపై విచారణ చేపట్టాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. కాగా నకిలీనాణాల కేసులో సీతంపేట మండలం దోనుబాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి. రామకృష్ణతోపాటు, కానిస్టేబుల్ పి. శ్రీనులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 3వ తేదీన నకిలీ ఇరీనియం నాణాలు, మహిమగల ఇతర వస్తువుల పేరుతో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే వారికి సహకరించారనే ఆరోపణలతో పోలీసులను అరెస్ట్ చేశారు. -
సీఎం నివాసానికి 'వంద'నం
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం.. తాత్కాలిక నివాసం.. క్యాంపు కార్యాలయం.. ఇలా రకరకాల పేర్లు చెబుతూ ఇప్పటి వరకు దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సీఎం నివాసం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటున్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయం ఉంది. ఉండవల్లిలో కృష్ణానది కరకట్టన ఓ ప్రైవేటు భవనం సీఎం నివాసానికి ఎంపిక చేశారు. వీటన్నిటికీ చంద్రబాబు పదవిలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో ఈ ఖర్చు చేసినట్లు సమాచారం. ఉండవల్లిలోని లింగమనేని ఎస్టేట్స్ సీఎం అధికారిక నివాసానికి ఎంపిక చేసినట్లుగా వార్తలకెక్కింది. ఇక్కడ ప్రత్యేక విద్యుత్తు సబ్‌స్టేషన్, సెల్ ఫోన్ టవర్లు, రహదార్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. 30 సెంట్ల స్థలంలో రూ. 5 కోట్ల వ్యయంతో విద్యుత్తు సబ్‌స్టేషన్ పనులు చకాచకా ప్రారంభించారు. సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రెండు టవర్లు ఏర్పాటు కానున్నాయి. ఒకటి బీఎస్‌ఎన్‌ఎల్‌ది కాగా, మరో టవర్ ఎయిర్టెల్, వోడా, ఐడియాలకు సంబంధించినదిగా చెబుతున్నారు. ఒక టవర్ ఏర్పాటుకు రూ. 70-80 లక్షల మధ్య ఖర్చవుతుంది. ఈ రెండు టవర్లకు కలిపి రూ. 1.6 కోట్ల వరకు ఖర్చు కానుంది. భవిష్యత్తులో వీటి నిర్వాహణకు సైతం ప్రభుత్వం కొంత భరించాల్సి ఉంటుందని సెల్ ఫోన్ కంపెనీ వర్గాల సమాచారం. ఇక్కడి రహదారుల నిర్మాణానికి రూ. 48 కోట్లకు పైగానే ఖర్చవుతుందని అంచనా. కృష్ణానదిపై భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక బోట్లు, అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. వీటికి కూడా మరో రూ. 5 కోట్లకు పైగానే కేటాయించాల్సి రావచ్చంటూ ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అతిథి గృహం మరమ్మతులకు, అక్కడ వినియోగించే సామగ్రికి రూ. 5-7 కోట్ల మధ్య ఖర్చవుతున్నట్లు సమాచారం. -
ఇంతకీ గెస్ట్ హౌస్ ఎవరికి?
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉండవల్లి కరకట్టపై ఉన్న లింగమనేని ఎస్టేట్స్ అతిథి గృహం సీఎం చంద్రబాబు నివాసం కోసమా లేక విదేశీయుల బస కోసమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ భవనానికి వాస్తుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. రాజధాని పనులను పర్యవేక్షించే విదేశీ ప్రతినిధులకు వసతి కల్పించేందుకే ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి ఉండేందుకే వాస్తు మార్పులు చేస్తున్నారని కూడా అనుకుంటున్నారు. -
చంద్రబాబు అధికారిక నివాసం అదేనా..!
తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్టపై ఏర్పాటు చేసుకోనున్న అధికారిక నివాసం వద్ద పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అత్యంత గోప్యంగా జరుగుతున్న ఈ పనులను అన్ని శాఖల అధికారులతోపాటు బీఎస్ఎన్ఎల్ అధికారులు సైతం మంగళవారం పరిశీలించారు. కొద్ది రోజులుగా ఉన్నత స్థాయి అధికారులు సీఎం అధికారిక నివాసంగా వినబడుతున్న లింగమనేని ఎస్టేట్స్ వద్దకు విస్తృతస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించారు. స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పలు శాఖల ఉన్నతాధికారులు రావడం, విలేకర్లను లోపలికి అనుమతించకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.