
ఇంతకీ గెస్ట్ హౌస్ ఎవరికి?
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉండవల్లి కరకట్టపై ఉన్న లింగమనేని ఎస్టేట్స్ అతిథి గృహం సీఎం చంద్రబాబు నివాసం కోసమా లేక విదేశీయుల బస కోసమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ భవనానికి వాస్తుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. రాజధాని పనులను పర్యవేక్షించే విదేశీ ప్రతినిధులకు వసతి కల్పించేందుకే ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి ఉండేందుకే వాస్తు మార్పులు చేస్తున్నారని కూడా అనుకుంటున్నారు.