లింగమనేని ఎస్టేట్ కేంద్రంగానే: తమ్మినేని | fake coins case: tammineni siraram slams government | Sakshi
Sakshi News home page

లింగమనేని ఎస్టేట్ కేంద్రంగానే: తమ్మినేని

Published Mon, Jul 11 2016 2:12 PM | Last Updated on Thu, Jul 26 2018 1:42 PM

fake coins case: tammineni siraram slams government

శ్రీకాకుళం : నకిలీ నాణాల మూలాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఈ వ్యవహారమంతా లింగమనేని ఎస్టేట్ కేంద్రంగా జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. నకిలీ నాణాల కేసులో రూ.20 నుంచి రూ.30 కోట్ల మేరకు డీల్ జరిగిందని తమ్మినేని తెలిపారు. శ్రీకాకుళంలో అరెస్ట్ అయిన నిందితులకు ఆ స్థాయి లేదని ఆయన అన్నారు.

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీకాకుళం జిల్లా రహస్య పర్యటన, ఎస్పీతో చర్చల వెనుక ఆంతర్యంపై విచారణ చేపట్టాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. కాగా నకిలీనాణాల కేసులో సీతంపేట మండలం దోనుబాయి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పి. రామకృష్ణతోపాటు, కానిస్టేబుల్‌ పి. శ్రీనులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 3వ తేదీన నకిలీ ఇరీనియం నాణాలు, మహిమగల ఇతర వస్తువుల పేరుతో నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. అయితే వారికి సహకరించారనే ఆరోపణలతో పోలీసులను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement