చంద్రబాబు అధికారిక నివాసం అదేనా..! | Lingamaneni Estates in Tadepalli | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అధికారిక నివాసం అదేనా..!

Published Wed, Jun 24 2015 2:35 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

చంద్రబాబు అధికారిక నివాసం అదేనా..! - Sakshi

చంద్రబాబు అధికారిక నివాసం అదేనా..!

తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్టపై ఏర్పాటు చేసుకోనున్న అధికారిక నివాసం వద్ద పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అత్యంత గోప్యంగా జరుగుతున్న ఈ పనులను అన్ని శాఖల అధికారులతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు సైతం మంగళవారం పరిశీలించారు.

కొద్ది రోజులుగా ఉన్నత స్థాయి అధికారులు సీఎం అధికారిక నివాసంగా వినబడుతున్న లింగమనేని ఎస్టేట్స్ వద్దకు విస్తృతస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్  ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించారు. స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పలు శాఖల ఉన్నతాధికారులు రావడం, విలేకర్లను లోపలికి అనుమతించకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement