సాక్షి, గుంటూరు: తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలో ఓ బ్యూటీ పార్లర్ నిర్వాహకుల వల్ల ఓ విద్యార్థిని ముఖంపై నీటిపొక్కులు వచ్చాయి. ఫలితంగా ఆమె తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. బ్యూటీపార్లర్‌కు సోమవారం సాయంత్రం ఉండవల్లికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని వచ్చింది. ఫేస్ వ్యాక్స్ చేయించుకుంది. ఆ రాత్రి ఆమె ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు వచ్చాయి. కంగారు పడిన ఆమె ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు ఫేస్ వ్యాక్స్ వల్లే ఇలా జరిగిందని చెప్పారు.
దీంతో విద్యార్థిని బంధువులు మంగళవారం బ్యూటీపార్లర్‌కు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా, ఘరానాగా సమాధానమిచ్చారు. ఇవన్నీ సహజమేనని చెప్పారు. చేతనైనది చేసుకోండి అంటూ దౌర్జన్యంగా మాట్లాడారు. దీంతో విద్యార్థిని పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని ముఖంపై వచ్చిన నీటిపొక్కులు తగ్గడానికి నాలుగు నెలల నుంచి 5 నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
చదవండి: Viral: స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తున్న డ్రాగన్స్.. నమ్మడం లేదా?
Comments
Please login to add a commentAdd a comment