పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు ఇదే
తాడేపల్లిరూరల్: ఒక కారులో విశాఖపట్నం ఏజన్సీ నుంచి గంజాయి తీసుకు వస్తున్నారని తెనాలి రూరల్ సీఐ సుబ్రహ్మణ్యానికి సమాచారం రావడంతో దుగ్గిరాల పోలీసులను శుక్రవారం అప్రమత్తం చేశారు. పోలీసులు కారుకోసం మంగళగిరి తెనాలి రోడ్‌లో బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున వేచి ఉండగా మెరుపు వేగంతో కారు ముందుకు వెళ్లిపోయింది. వెంటనే పోలీసులు కారును వెంబడించారు. గంజాయి తరలిస్తున్న కారు ఈమని రోడ్డులోకి వెళ్లి పలు డొంకరోడ్లలో చక్కర్లు కొడుతూ చివరకు మోరంపూడి గ్రామ శివారుల్లో నిలిపివేసి కారు వదిలి అక్కడి నుంచి గంజాయి బ్యాచ్ పరారైంది. సేకరించిన వివరాల ప్రకారం తెనాలి ఐతానగర్‌కు చెందిన ముగ్గురు యువకులు, ఇంజినీరింగ్ చదువుతున్న మరో విద్యార్థి, చదువుతున్న మరో విద్యార్థి కలసి ఏపీ39జేడీ6606 నంబరు గల కారులో గంజాయిని తెనాలి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో వెంబడించడంతో ఆ ముగ్గురు యువకులు, విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు లోపల భాగంలో, సీట్ల మీద, డాష్ బోర్డులో ఉన్న చిన్నచిన్న గంజాయి పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిక్కీ, డోర్లలో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం. పోలీసులు జరిగిన సంఘటనపై వివరణ కోరగా కారు స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమేనని, పంచనామా జరిగిన అనంతరం గంజాయి ఎంత వుందో తెలియజేస్తామని అన్నారు.
చదవండి: ఒమిక్రాన్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళిక ఇదే..: ఆరోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment