తాడేపల్లిరూరల్: సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుడివాడకు చెందిన పాలకొండ సుబ్రహ్మణ్యం (38) జుమోటాలో పనిచేస్తూ హైదరాబాద్‌లో నివాసముండేవాడు. వారి ఇద్దరి పిల్లలకు గురుకుల పాఠశాలలో సీటు రావడంతో విజయవాడ బదిలీ చేయించుకున్నాడు. తాడేపల్లిలో విధులు ముగించుకుని విజయవాడ మొగల్‌రాజపురంలోని తన నివాసానికి వెళుతుండగా మార్గంమధ్యలో ఉండవల్లి సెంటర్ స్క్రూ బిడ్డి వద్దకు వచ్చేసరికి ఫోన్ రావడంతో బండి పక్కకు తీసి మాట్లాడుతుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు వచ్చి ఢీకొట్టింది. స్థానికులు కేకలు వేయడంతో బస్సు నిలిపివేయగా అప్పటికే సుబ్రహ్మణ్యం శరీరం మీదకు బస్సు వెనుక టైర్లు ఎక్కాయి. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి బస్సుకింద ఉన్న సుబ్రహ్మణ్యాన్ని తాడేపల్లిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాడు.
చదవండి: ఒమిక్రాన్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళిక ఇదే..: ఆరోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment