దక్షిణభారతంలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. రాష్ట్రంలో ఉద్రిక్తలు తగ్గించవలసి ఉందన్నారు. ఉద్రిక్తతలు నివారించడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకు మీరు కూడా సహకరించాలని మీడియా వారిని కోరారు. జాతీయ విగ్రహాలు ధ్వంసం చేసినందువల్ల వారిని అభిమానించేవారి మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. అంతకు మించి ఏమీ జరగదని చెప్పారు. ఆందోళన వల్ల ఫలితం ఉండదని చెప్పారు. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ సమావేశాలు జరుగుతాయని, అక్కడ ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయాలన్నారు. ప్రజలు కూడా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులకు తమకు ఏం కావాలో చెప్పాలన్నారు. వారు ఆయా సభలలో ప్రజల వాణిని వినిపిస్తారని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సిఫారసు మాత్రమే చేసిందన్నారు. ఏ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఏ పార్టీ విప్ జారీ చేయలేదని చెప్పారు.