జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసిన ఉండవల్లి
Published Sat, Dec 24 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
రఘుదేవపురం (సీతానగరం) :
రఘుదేవవురం పంచాయతీ శ్రీరామనగరంలోని శ్రీ చిట్టిబాబాజీ సంస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థానంలో జస్టిస్ చలమేశ్వర్, లక్ష్మి దంపతులు శాంతిహోమం, గోపూజ, సువర్చలా సమేత హనుమద్ర్వతం, చిట్టిబాబాజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఉండవల్లి కలిశారు. జస్టిస్ చలమేశ్వర్‌కు మాజీ ఎంపీని సంస్థానం నిర్వాహకుడు జగ్గబాబు పరిచయం చేశారు. అనంతరం ఉండవల్లి శ్రీ చిట్టిబాబాజీని దర్శించారు.
Advertisement
Advertisement