పవన్ కల్యాణ్ స్పందించాలంటూ ఫ్లెక్సీలు | powerstar pawankalyan flexies in ap capital villages | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ స్పందించాలంటూ ఫ్లెక్సీలు

Published Thu, May 5 2016 1:10 PM | Last Updated on Sat, Jul 6 2019 4:08 PM

పవన్ కల్యాణ్ స్పందించాలంటూ  ఫ్లెక్సీలు - Sakshi

పవన్ కల్యాణ్ స్పందించాలంటూ ఫ్లెక్సీలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు తమ పొలాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని పొలాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. ప్రభుత్వ బలవంతపు భూ సేకరణపై పవన్ స్పందించాలంటూ ఫ్లెక్సీల్లో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

భూములు ఇవ్వమని ఎన్ని సార్లు చెప్పినా తమను భయపెట్టడానికి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. మూడు పంటలు పండే భూములను కాపాడుకునేందుకు పోరాడుతున్నామని...తమకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, సబ్సిడీలు కూడా ఆపేశారని తమ బాధను వెల్లడించారు.

సీడ్ క్యాపిటల్ పరిధిలో తమ గ్రామాలు లేకపోయినా భూములను టార్గెట్ చేశారన్నారు. ప్రాణాలు పోయినా సరే..తమ భూములను వదులుకోమని దీనిపై పవన్ కల్యాణ్ స్పందించాలని కోరుతున్నట్లు ఫ్లెక్సీల్లో తెలిపారు. గతంలో రాజధాని రైతులను ఆదుకుంటానని పవన్ స్వయంగా గ్రామాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement