penumaka
-
అయ్యో బిడ్డా; కన్న కూతురినే వద్దనుకుంది
తాడేపల్లి రూరల్: పేగు బంధం చిన్నబోయింది. ఓ కన్నతల్లి తన కుమార్తెను వద్దనుకోగా.. మరోచోట ఓ కుమార్తె వృద్ధురాలైన తల్లిని ఇంటినుంచి గెంటేసింది. తాడేపల్లి మండలంలో బుధవారం వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి పట్టణానికి చెందిన ఓ యువతి సుమారు మూడేళ్ల క్రితం ప్రాతూరుకు చెందిన ఓ యువకుణ్ణి ప్రేమ వివాహం చేసుకుంది. కొంతకాలానికి వారికి కుమార్తె జన్మించింది. ఆ తరువాత ఆ దంపతులు విడిపోయి వేర్వేరుగా ఉంటుండగా.. కుమార్తె తల్లి దగ్గరే పెరిగింది. ఇటీవల సదరు యువతి తనను భర్త వేధిస్తున్నాడంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెద్దల రంగప్రవేశంతో కేసు వాపసు తీసుకుంది. ఈ క్రమంలో కుమార్తె తనకు వద్దంటూ.. తండ్రికి అప్పగించి వెళ్లిపోయింది. తల్లి కావాలంటూ ఆ బాలిక గుక్కపెట్టి ఏడుస్తున్నా వెనుదిరిగి చూడకుండానే ఆ తల్లి వెళ్లిపోయింది.(చదవండి: ప్రేమ పెళ్లి, పోలీస్ స్టేషన్‌కు వధూవరులు) పెనుమాకలో వృద్ధురాలి గెంటివేత మరోవైపు పెనుమాక గ్రామంలో ఓ వృద్ధురాలిని కన్న కూతురే ఇంటినుంచి గెంటేసి.. ఇంటికి తాళాలు వేసుకుంది. గ్రామానికి చెందిన రావూరి చిన్నమ్మాయి అనే వృద్ధురాలు 2010లో ఇందిరమ్మ పథకం కింద రెండు పోర్షన్ల ఇల్లు నిర్మించుకుంది. ఒక పోర్షన్లో కొడుకు కోటేశ్వరరావు, రెండో పోర్షన్లో కుమార్తె నాగమణి నివాసం ఉంటున్నారు. అయితే, ఇటీవల తన అన్నయ్య, తల్లి కలిసి తన ఇల్లు ఆక్రమించుకున్నారంటూ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి చిన్నమ్మాయి ఇల్లు తనకు మంజూరైందని, తానే కట్టించుకున్నానని చెప్పడంతో.. పోలీసులు చనిపోయేంత వరకు తల్లి ఆ ఇంట్లోనే ఉండేవిధంగా చెప్పి పంపించారు. అయితే బుధవారం కుమార్తె నాగమణి తల్లి చిన్నమ్మాయిని ఇంటినుంచి బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసింది. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు రోడ్డు పాలైంది. -
అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే
సాక్షి, గుంటూరు: రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకముందే ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే సోమవారం పెనుమాక నుంచి ర్యాలీకి సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా రాజధాని ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని, భూములు ఇచ్చిన వారికి కూడా ప్లాట్లు ఇవ్వలేదన్నారు. గతంలో తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రాజధాని ముసుగులో 25 రోజులు విషప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పులను, దళితులకు చేసిన అన్యాయాన్ని బయటకు రానీవకుండా చూసుకోవడానికి టీడీపీ కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి రాజధాని గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో గతంలో జరిగిన ఘటన వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేసి రాజధానిలో ఏదో జరిగిపోతోందన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలపై హైపవర్ కమిటీ తమ నిర్ణయాన్ని ఇంకా వెలువరించలేదన్నారు. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ అధికార ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉన్నా కూడా చంద్రబాబు పట్టించుకోకుండా గత 25 రోజులుగా దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని దూషిస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. లక్షల కోట్లు దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. రాజధాని రైతుల సాక్షిగా అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాల్సిందేనని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సంబంధిత వార్తలు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్ వికేంద్రీకరణతో శరవేగంగా రాష్ట్రాభివృద్ధి వరదొస్తే అమరావతికి ముప్పే ఇదీ భ్రమరావతి కథ -
సీఎం వైఎస్ జగన్ భద్రత ఇలాగేనా?
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని వందేమాతరం హైస్కూల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి బయల్దేరారు. సీఎం కాన్వాయ్ పెనుమాక నుంచి ఉండవల్లి సెంటర్ మీదుగా తాడేపల్లి వైపుకు వస్తున్న సమయంలో ఉండవల్లి సెంటర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లే వాహనాలను ఒక్కసారిగా వదిలేశారు. దీంతో అతి తక్కువ వ్యవధిలో పదుల సంఖ్యలో వాహనాలు సీఎం కాన్వాయ్‌లో కలిసిపోయాయి. ఇలా, సీఎం ప్రయాణించే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించడం ఆయన భద్రతకు ముప్పని పోలీస్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
రాజన్న బడిబాటలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
-
మీ పిల్లలకు మామగా అండగా ఉంటా: సీఎం జగన్
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొస్తామని, రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా పెనుమాక జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన రాజన్న బడిబాట–సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పాదయాత్రలో ప్రతి తల్లికి, చెల్లికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సందర్భంగా ఇవాళ చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ‘మీ పిల్లలను బడికి పంపిస్తే చాలు..వారికి మామగా అండగా ఉంటాను’ అని భరోసా ఇచ్చారు. పిల్లలను బడికి పంపించిన తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు అందజేస్తామని సీఎం జగన్ ప్రకటన చేశారు. చదవండి: రాజన్న బడిబాటలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘ఇవాళ చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే ఈరోజు నా మనసుకు అన్నింటికన్నా నచ్చిన కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి. నా కోరిక ఒక్కటే. పిల్లలు బడికి వెళ్లాలి. బడుల నుంచి కాలేజీలకు వెళ్లాలి. కాలేజీ నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. ఉన్నత విద్యావంతులు కావాలి. అయితే ఆ చదువుల కోసం ఏ తల్లి, తండ్రి కూడా అప్పులు పాలు కాకూడదనే నా ఆశ. నా పాదయాత్ర సందర్భంగా పేదల కష్టాలను చూశాను. వారు పడుతున్న బాధలు విన్నా.బిడ్డలను చదివించాలన్న ఆరాటం ఉన్నా...చదవించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశాను. పిల్లలను ఇంజినీరింగ్ చదవించాలని, ఆ చదువుల కోసం ఖర్చులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చూశాం. ఈ విద్యా వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులు తెస్తామని ప్రతి తల్లికి, చెల్లికి హామీ ఇచ్చాను. మీ పిల్లల చదువును ఇకపై నేను తీసుకుంటానని మాటిచ్చా. ఇవాళ ఆ మాట నిలబెట్టుకునే రోజు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి తల్లికి, చెల్లికి, ఒకే ఒకమాట చెబుతున్నా. మీ పిల్లలను బడులకు పంపించండి. మీరు చేయాల్సిందల్లా కేవలం బడులకు పంపించడమే. బడికి పంపించినందుకు జనవరి 26 తేదీకల్లా... రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ దినం చేస్తాం. ఏ తల్లి అయితే తమ పిల్లలను బడులకు పంపిస్తుందో...వాళ్లకు రూ.15 వేలు డబ్బులు చేతిలో పెడతాం. ఏ తల్లి కూడా తన పిల్లలను చదవించడానికి అవస్థ పడకూడదనే ఈ కార్యక్రమం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నిరక్షరాస్యత 26 శాతం ఉంటే... మన రాష్ట్రంలో 33శాతం ఉంది. ఇలాంటి దారుణ పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితిలో మార్పు రావాలి. మన పిల్లలు దేశంలో ఎవరితో అయినా పోటీ పడేలా ఉండాలి. ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నామని నా పాదయాత్రలో చూశాను. పిల్లలకు సకాలంలో పుస్తకాలు అందడం లేదు. ఏప్రిల్, మే మాసంలో పుస్తకాలు అందాలి. స్కూల్ తెరిచిన వెంటనే పుస్తకాలు, మూడు జతల యూనిఫాం అందజేయాలి. మన ఖర్మ ఏంటంటే..నా పాదయాత్రలో గమనించా..పిల్లలకు సెప్టెంబర్ దాటిన కూడా పుస్తకాలు అందలేదు. యూనిఫాం కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. టీచర్ల ఉద్యోగాల కొరత ఉన్నా రిక్రూట్మెంట్ చేయలేదు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తే ఆ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మరుగుదొడ్లు ఉండవు. నీళ్లు ఉండదు. ఫ్యాన్ లేదు. కాంపౌండు వాల్ ఉండదు. ఇక పిల్లలను చదివించాలంటే ఏ తల్లైనా భయపడాల్సిందే. ప్రైవేట్ రంగంలో స్కూళ్లలో ఫీజులు షాక్ కొడుతున్నాయి. నారాయణ, శ్రీ చైతన్య వంటి స్కూళ్లలో ఫీజులు విఫరీతంగా వసూలు చేస్తున్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితి ఉన్నప్పుడు మన పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా మార్చేస్తానని మాటిస్తున్నాను. ఇవాళ ప్రతి స్కూల్‌ను కూడా ఫోటో తీయండి. రాష్ట్రంలో 40 వేల స్కూళ్లు ఉన్నాయి. రెండేళ్లలో అదే స్కూళ్లు ఎలా ఉన్నాయో చేసి చూపిస్తాం. పాఠశాలలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నాను. ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతాం. ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్ట్‌ను తప్పని సరి చేస్తాం. ఈ రోజు చదువుల విప్లవాన్ని తీసుకువచ్చి, మంచి స్కూళ్లుగా తీర్చిదిద్దుతాం. ఏ తల్లి కూడా అవస్థలు పడకుండా చేస్తాం. ప్రతి తల్లికి అన్నగా తోడుంటాను. మీ పిల్లలను బడికి పంపించండి. నేనున్నాను.. ఆ పిల్లలకు మామగా ఉంటాను. ఈ స్కూళ్ల పరిస్థితి మారాలి. కాబట్టి ప్రతి పిల్లాడికి స్కూళ్ల బాట పట్టమని అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ముగిస్తున్నాను.’ అని అన్నారు. -
రాజన్న బడిబాటలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లి మండలం పెనమాకలోని వందేమాతరం హైసూల్క్‌లో ఒకేసారి 2వేలమంది విద్యార్థుల సామూహిక అక్షరాభాస్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన సరస్వతి దేవి పటానికి అంజలి ఘటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పలువురు చిన్నారులను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అక్షరాభ్యాసం చేయించి, అమ్మ ఒడిని చల్లగా దీవించారు. ఆ తర్వాత విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జిల్లా కలెక్టర్ శామ్యూల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ... సర్కార్ పాఠశాలల్లో అనేక వసతులు కల్పించడంతో తల్లిదండ్రులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రాథమిక విద్య 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ హైస్కూల్‌కు పంపిస్తున్నారు. ఈ ఏడాది స్కూల్ ప్రారంభించేనాటికే విద్యార్థులకు సంబంధించి 19.85 లక్షల పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు యూనిఫాం అన్ని పాఠశాలలకు చేరింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, 2,51,601 మంది బూట్లు, రెండు జతల సాక్సులు అందిస్తున్నారు. 8, 9 తరగతులు చదివే బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. -
పెనుమాకలో రైతుల ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. మంగళవారం పెనుమాక రైతులతో సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. అధికారుల తీరుకు నిరసనగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కుర్చీలు విసిరేసి... అధికారులతో వాగ్వాదానికి దిగారు. పెనుమాక భూసేకరణ, రైతులు ఇచ్చిన అభ్యంతరాలపై అధికారులు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రైతుల అభ్యంతరాలను సీఆర్డీఏ అధికారులు నమోదు చేయలేదు. దీంతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితోపాటు రైతులు అధికారుల తీరును తప్పుబట్టారు. అభ్యంతరాలు నమోదు చేయాలని పట్టుబట్టినప్పటికీ, అధికారులు మాత్రం ససేమిరా అనడంతో రైతులు ఆగ్రహించారు. టెంట్లు పడేసి.. కుర్చీలు విసిరేశారు. దీంతో సమావేశం కాస్తా ఉద్రిక్తంగా మారింది. -
సీఆర్డీఏ అధికారులకు చుక్కెదురు
-
పెనుమక సీఆర్డీఏ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
-
బాబూ! ఇక నీ భూదోపిడీ సాగదు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి - కోర్టు తీర్పే సర్కార్‌కు చెంపపెట్టు సాక్షి, హైదరాబాద్: రాజన్న వారసులుగా, జగనన్న సైనికులుగా రాజధానిలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగినా ప్రభుత్వంపై దండెత్తేందుకు ఏమా త్రం వెనుకాడబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశా రు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న భూదోపిడీకి రాష్ట్ర హైకోర్టు అడ్డుకట్ట వేయడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. హైకోర్టు ఆదేశాలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, రైతుల భూములను బలవంతం గా లాక్కునే అప్రజాస్వామిక చర్యలు మాను కోవాలని హితవు పలికారు. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ, యథాతథ స్థితి (స్టేటస్కో) కొనసాగించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లా డుతూ.... రైతన్న వ్యవసాయ పనులు యథా తథంగా కొనసాగించుకునేందుకు న్యాయ స్థానం స్పష్టంగా తీర్పునివ్వడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. వేలాది ఎకరాలు రైతులనుంచి లాక్కున్నారని, అందు లో ఒక్క శాతమైన రాజధాని నిర్మాణానికి వినియోగించారా..? అని నిలదీశారు. భయపెట్టడం వల్లే కోర్టుకు ఈనెల 11న పెనుమాక గ్రామానికి సంబం ధించి 660 ఎకరాలకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందని, దీనిపై రైతుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చిందని ఆర్కే గుర్తుచేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వెళితే ఇబ్బందులు వస్తాయని అడ్డదారిలో రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. పంటలు తగలబెట్టి, రైతన్నను అన్ని విధాలా హింసించి ప్రభుత్వం వేధింపులకు పాల్పడిం దని గత సంఘటనలను గుర్తు చేశారు. ఇప్పటికైనా న్యాయస్థానం తీర్పుకు లోబడి రైతన్న అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భూసేకరణ చేయలేరు మంగళగిరి (మంగళగిరి): రాజధాని భూస మీకరణకు భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులు కోర్టులను ఆశ్రయించి కోర్టు ఆదేశా లతో వ్యవసాయం చేసుకుంటుండగా, పైగా భూములకు సంబంధించిన అంశం కోర్టులో ఉండగా ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం అంటే చట్టాన్ని దుర్వినియో గం చేయడమేనని ఆర్కే మండిపడ్డారు. మం డలంలోని కురగల్లు, నవులూరు గ్రామాల పరిధిలో రాజధాని భూసమీకరణకు భూము లు ఇవ్వని రైతులకు భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ చేయలేదని స్పష్టంచేశారు. -
హైకోర్టు తీర్పును స్వాగతించిన ఆర్కే
-
ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు.
-
ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాజధాని గ్రామాల్లో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్ పై స్టేటస్ కో విధించింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అన్నదాతల అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకెళ్లాలని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో 904 మంది భూ యజమానులు ప్రభావితులు అవుతారని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను పెనుమాక రైతులు స్వాగతించారు. ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేసి భూములు గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. తమ తరపున పోరాడుతున్నందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ తీర్మానాలు చేసినా పట్టించుకోకుండా భూములు లాక్కునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. -
క్యాపిటల్ పనిష్మెంట్
-
కోర్టు ధిక్కరణపై కేసు వేస్తాం: ఎమ్మెల్యే ఆర్కే
-
కోర్టు ధిక్కరణపై కేసు వేస్తాం: ఎమ్మెల్యే ఆర్కే
అమరావతి : తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సోషల్ ఇన్‌ఫ్యాక్ట్ అసెస్మెంట్ సరిగా జరగలేదని పది రోజుల క్రితం రైతులు కోర్టును ఆశ్రయించారని ఆయన అన్నారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడాని ప్రభుత్వం మూడు వారాల గడువు కోరిందనే విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈలోపే భూసేకరణ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కోర్టు ధిక్కరణపై కేసు వేస్తామని ఆర్కే తెలిపారు. చంద్రబాబు భూ దాహానికి అంతు అనేది లేకుండా పోతోందని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న తాము ఏమైనా చేస్తాం, ఎదురు వస్తే ఎంతటికైనా తెగిస్తామనే ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు. మూడు పంటల పండే భూమిని వదిలిపెట్టాలని గతంలో న్యాయస్థానం చెప్పినప్పటికీ ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌తో కోర్టు ధిక్కరణకు పాల్పడిందన్నారు. కాగా పెనుమాక గ్రామానికి అధికారులు 660.83 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో 904 మంది భూ యజమానులు ప్రభావితులు అవుతారని ఆ నోటిఫికేషన్లో అధికారులు పేర్కొన్నారు. -
రాజధాని గ్రామాల్లో రౌడీయిజం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం రౌడీయిజం చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై, భూములు ఇవ్వని రైతులపై టీడీపీ సర్కారు దౌర్జన్యానికి పాల్పడుతోంది. ల్యాండ్‌పూలింగ్‌కు ఇవ్వని పంటపొలాలను ధ్వంసం చేసి రైతుల్లో భయాందోళనలు సృష్టించడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను ధ్వంసం చేసేందుకు యత్నించారు. లింగాయపాలెం సమీపంలోని అనుమోలు గాంధీకి చెందిన పొలంలో బుధవారం భారీ చెట్లను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు పరుగు పరుగున రావడం గమనించిన డ్రైవర్లు జేసీబీలను విడిచి పారిపోయారు. రైతులు, ఐక్యవేదిక సభ్యులు పంటపొలాల వద్దకు చేరుకుని ప్రభుత్వ దౌర్జన్యంపై నిరసన తెలిపారు. రైతులను భయపెట్టి భూములు లాక్కోవాలని చూస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. ఏం జరిగిందంటే.. లింగాయపాలెంలో అనుమోలు గాంధీకి సర్వే నంబర్ 184లో 4.03 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని ఆయన పూలింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పొలాన్ని లింగాయపాలెం గ్రామానికి చెందిన శంకరయ్య అనే రైతుకు కౌలుకు ఇచ్చారు. ఆ రైతు ఎకరానికి రూ.2.25లక్షల చొప్పున మొత్తం రూ.9లక్షలు వెచ్చించి మొక్కజొన్న, కంద పంట సాగు చేశారు. విరగపండిన మొక్కజొన్న కోతలు ప్రారంభించారు. ఇంకా కొంత కోయాల్సి ఉంది. అది పూర్తయ్యాక కంద తవ్వకం ప్రారంభించాలనుకున్నారు. ఇంతలో బుధవారం మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో రెండు జేసీబీలు గాంధీ పొలం వద్దకు చేరుకున్నాయి. పంటపొలంలోకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న భారీ తాటిచెట్లను జేసీబీలతో పెకలించటం ప్రారంభించారు. 10 చెట్లను పెకలించి నూర్పిడికి సిద్ధంగా చేసిన మొక్కజొన్న పంటలోనే పడేశారు. తాటిచెట్లను పెకలించే సమయంలో కంద పంట కూడా కొంత దెబ్బతింది. భారీ తాటిచెట్లు కిందపడే సమయంలో వచ్చిన శబ్ధంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. జేసీబీలు ఉన్న ప్రాంతానికి స్థానికులు కొందరు పరుగులు పెట్టారు. రైతులు వస్తున్నారని గమనించిన డ్రైవర్లు జేసీబీలను విడిచి పారిపోయారు. జేసీబీలను పంపించినదెవరు? రాజధాని గ్రామాల్లో ప్రభుత్వ దౌర్జన్యాలు ఓ పథకం ప్రకారం సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో సాగుతున్న దౌర్జన్యకాండలో ప్రభుత్వ విభాగాలు, అధికారులు పావులుగా వ్యవహరిస్తున్నారు. దౌర్జన్యాలు జరిగే సమయంలో సీఆర్డీఏ, రెవెన్యూ విభాగం నేరుగా రంగంలో ఉండటం లేదు. బుధవారం జరిగిన దౌర్జన్యకాండలోనూ సీఆర్డీఏ నేరుగా తెర మీదకు రాలేదు. భూములు ఇవ్వని రైతులను భయపెట్టి లాక్కోవడంలో భాగంగా ప్రభుత్వ పెద్దలే జేసీబీలు పంపించినట్లు రైతులు చెబుతున్నారు. ఉద్యమనేతలకు ప్రభుత్వ హెచ్చరిక! రాజధానిలో ప్రభుత్వం రైతుల చేస్తున్న అన్యాయాలపై దళితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ నేతలు ఏకమై రాజధాని ఐక్యవేదిక పేరుతో ఇటీవల లింగాయపాలెంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ఆ సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై జాతీయస్థాయిలో ఉద్యమం చేపడుతున్నట్లు ప్రకటించారు. రాజధానిలోని పలుగ్రామాల్లో నిపుణుల కమిటీ సభ్యులను రైతులు అడ్డుకోవటాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. రైతులను ఏకం చేస్తున్న ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఐక్యవేదిక సభ్యుడు అనుమోలు గాంధీని టార్గెట్ చేసి ఉద్యమకారులకు హెచ్చరికలు జారీ చేశారనే ప్రచారం జరుగుతోంది. భయపెట్టి బలవంతంగా లాక్కోవటమే లక్ష్యం రాజధాని ప్రకటించిన మొదట్లో భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతులను ప్రభుత్వం రకరకాలుగా వేధిపులకు గురించేసింది. ఉండవల్లి, పెనుమాకలో అరటితోటను గుర్తుతెలియని వ్యక్తులు తగులపెట్టారు. మల్కాపురం వద్ద చెరుకుతోటకు నిప్పంటించారు. వెలగపూడి, లింగాయపాలెం పరిధిలోనూ పంటపొలాల్లో దౌర్జన్యం చేసి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. అదే తరహాలో మరోసారి రైతులను భయభ్రాంతులకు గురిచేసేందుకే జేసీబీలను పంపించిందని తెలుస్తోంది. ప్రభుత్వ చర్యలపై ఐక్యవేదిక సభ్యులు మండిపడ్డారు. భూముల కోసం రైతులను భయపెట్టాలని అనుకుంటే ప్రభుత్వం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఐక్యవేదిక కొనసాగిస్తున్న ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ దౌర్జన్యకాండపై చట్టపరంగా ముందుకు వెళ్తామని ప్రకటించారు. పెనుమాకకు నోటిఫికేషన్ రాజధానిలో మరో గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్ జారీ అయింది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి అధికారులు 660.83 ఎకరాలకు నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో 904 మంది భూ యజమానులు ప్రభావితులు అవుతారని ఆ నోటిఫికేషన్లో అధికారులు పేర్కొన్నారు. -
రాజధాని గ్రామాల్లో రౌడీయిజం
-
రాజధాని రైతుల్లో గుబులు
► నోట్ల రద్దుతో రైతుల్లో కలవరం ► 4 వేల ఎకరాలకు పైగా అమ్మకాలు.. లాకర్లలో భారీగా నగదు ► తాజా భూ లావాదేవీల అడ్వాన్సలు వెనక్కి ఇచ్చేస్తామంటున్న రైతులు సాక్షి, అమరావతి: నల్లధనాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల్లో గుబులు బయలుదేరింది. తమ భూముల్ని అమ్మి రూ.కోట్లలో బ్యాంకు లాకర్లలో రైతులు భద్రపరచడమే వారి అభద్రతకు కారణమైంది. రాజధాని ప్రకటన సమయం లో ఆ ప్రాంతంలోని భూములు రేట్లు అమాంతం పెరిగాయి. 4 వేల ఎకరాలకు పైగా లావాదేవీలు జరిగాయి. ఎకరా సగటున రూ.1.25 కోట్లకు విక్రయించారని అంచనా. ఇందులో సగం మంది రైతులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. కొందరు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు. ఇంకొందరైతే అధునాతన కార్లు, బైకులు కొనుగోలు చేశారు. మిగిలిన సొమ్మును దాచుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్న సమయంలో ఈ ప్రాంత రైతుల నుంచి డిపాజిట్లు స్వీకరించేందుకు దాదాపు అన్ని వాణిజ్య బ్యాంకులు ఇక్కడ పుట్టగొడుగుల్లా వెలిశాయి. అవి ఆశించిన మేర డిపాజిట్లు స్వీకరణ సాగలేదు. అయితే రైతుల్లో అధిక శాతం మంది లాకర్లను తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో అప్పట్లో జరిగిన భూ లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కూడా దృష్టి సారించింది. ఇప్పుడు హఠాత్తుగా రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఆ రైతులు కుదేలయ్యారు. బ్యాంకుల్లోని లాకర్లలో భద్రపరిచిన నగదును ఇప్పుడు ఎలా చలామణీలోకి తేవాలని అంతర్మథనంలో ఉన్నారు. నిడమర్రుకు చెందిన ఓ రైతు వారం క్రితం తనకున్న ఎకరం పొలాన్ని రూ.1.25 కోట్లకు అమ్మగా వచ్చిన డబ్బు తన వద్దే ఉంచుకున్నాడు. మంగళవారం రాత్రి పెద్ద నోట్ల రద్దుతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. పెనుమాకకు చెందిన ఓ వ్యాపారి ఇటీవలే ఉండవల్లిలో జరీబు పొలం కొనుగోలు చేశారు. ఇందుకు గాను ఉండవల్లి రైతుకు రూ.40 లక్షలు అడ్వాన్సగా ఇచ్చాడు. మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధం చేసుకుంటుం డగా, నోట్ల రద్దు నిర్ణయంతో రైతు హతాశుడై, వ్యాపారి తనకిచ్చిన అడ్వాన్‌సను వెనక్కు తీసుకెళ్లాలని బతిమాలుతున్నాడు. ఇలా ఏ రైతును కదిలించినా నోట్ల రద్దుపై బోరుమంటున్నాడు. -
CRDA ఆఫీసు ఎదుట రైతుల ఆందోళన
-
‘అవినీతి సెంటు’ నుంచి తప్పించుకునేదెలా?
‘సాక్షి’ కథనాలతో అధికార పార్టీ నేతల్లో కలవరం రైతులు నిలదీయడంతో అనంతవరం సీఆర్డీఏ కార్యాలయానికి తాళం భూ కుంభకోణం వాస్తవమేనన్న టీడీపీలోని ఓ వర్గం నేతలు సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ రాజధాని గ్రామాల్లో అవినీతి ‘సెంటు’ నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతలు, కొందరు సీఆర్డీఏ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. భూ కబ్జాపై ‘సాక్షి’ పత్రిక తప్పుడు కథనాలు రాసిందని చెప్పడానికి టీడీపీ నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రెండ్రోజులుగా విలేకరుల సమావేశం అని చెప్పి రద్దు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం రాత్రి వరకు తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులు రికార్డులతో కుస్తీ పడుతున్నారు. అనంతవరంలో సెంట్ల చొప్పున భూదోపిడీపై ‘సాక్షి’కి పక్కా ఆధారాలు ఎలా దొరికాయి? ఎవరి చ్చారు? అనే దానిపై టీడీపీ నేతలు విచారణ చేపట్టారు. మా భూమి ఎలా మాయమైంది? రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరంలో భూ కుంభకోణంపై ‘సాక్షి’ పక్కా ఆధారాలతో వరుస కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ‘సాక్షి’ ప్రతినిధులను బెదిరించడం, గ్రామస్తులను భయపెట్టడం వంటి చర్యలకు దిగారు. పత్రికలో వచ్చిన కథనాలు అవాస్తవం... తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు గానీ వాటిని బయటపెట్టడం లేదు. మరోవైపు సోమవారం ఉదయం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టారు. తమ భూమిలో నుంచి సెంట్ల చొప్పున స్థలం ఎలా మాయమైందని నిలదీశారు. అధికారులు ఏం సమాధానం చెప్పాలో తెలియక కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. రైతులకు అన్యాయం జరిగితే సహించం రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ సహించలేక టీడీపీలోని ఓ వర్గం ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది. భూ కుంభకోణంపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలు వాస్తవమేనని ఆ వర్గం నేతలు స్పష్టం చేశారు. పొరపాట్లు ఉంటే సవరించుకుంటాం ‘‘100 రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూ యజమానులను గుర్తించాం. ఫారం 9(1) ఇచ్చిన రైతుల భూముల వివరాలు, సర్వేలో వెల్లడైన భూముల వివరాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సవరించుకుంటాం. సర్వే నంబర్ 270లో ఆరుగురు రైతులకు కలిపి 15 ఎకరాల 94 సెంట్లు పొలం ఉందన్నారు. వీరిలో బండల వెంకాయమ్మ అనే మహిళా రైతు 3 ఎకరాల 74 సెంట్లు సీఆర్డీఏకు ఇచ్చింది. అయితే సీఆర్డీఏ నిర్వహించిన సర్వేలో 3 ఎకరాల 39 సెంట్లు మాత్రమే ఉన్నట్టు తేలింది. ఈటీఎస్ ద్వారా సర్వే నిర్వహించగా 3 ఎకరాల 42 సెంట్లు ఉన్నట్లు తేలింది. దీంతో అందరికీ లెక్క సరిపోయింది. వెంకాయమ్మ ఇచ్చింది 3 ఎకరాల 74 సెంట్లు. డాక్యుమెంట్ల ప్రకారం అయితే సర్వే నంబర్లో ఉన్న 15 ఎకరాల 94 సెంట్లకు మరో 32 సెంట్లు అదనంగా చేర్చాల్సి ఉంది. ఈ అదనపు భూమిని సీఆర్డీఏ ఎక్కడ నుంచి తేవాలి? జమ్మిగుంపుల పద్మజ సర్వేనంబర్ 114 లో 1.95 ఎకరాలు ఉన్నట్టు చూపగా ఎకరం 90 సెంట్లకు సెటిల్ చేశాం. నెల్లూరి రావమ్మ సర్వేనెంబర్ 119/బిలో 1.99 సెంట్లు చూపగా 1.90 సెంట్లకు సెటిల్ చేశాం. గొరిజాల అరుణకు 1.17 ఎకరాలు చూపగా ఎకరానికి సెటిల్ చేశాం. పోలు భూ దేవయ్య సర్వే నెంబర్ 81/1 లో 1. 13 ఎకరాలు ఉన్నట్టు చూపినా ఆయన వద్ద కేవలం 40 సెంట్లకు మాత్రమే డాక్యుమెంట్ ఉంది. సర్వేనంబర్ 100ఈలో బండల సూరిబాబుకు 36 సెంట్లు ఉన్నా 8 సెంట్లే ఉన్నట్లు సీఆర్డీఏ అధికారులు తప్పుడు సర్టిఫికెట్ ఇవ్వడంపై విచారణ చేస్తాం’’ – చెన్నకేశవులు, సీఆర్డీఏ డిప్యూటీ కమిషనర్ -
రెండేళ్ల క్రితమే ‘సెంటు’ స్కెచ్
అనంతవరం భూముల్లో అంతులేని అవినీతి గుట్టుచప్పుడు కాకుండా రికార్డులు తారుమారు కైంకర్యం చేసిన భూములు అమ్మేశారు ‘సాక్షి’ కథనంతో బైటకొస్తున్న మరింతమంది బాధితులు రాజధాని రైతుల నుంచి ఫోన్ల వెల్లువ అన్యాయమైపోయాం.. ఆదుకోవాలంటూ వేడుకోలు టీడీపీ నాయకులు, సీఆర్డీఏ అధికారుల అక్రమాలపై ఆందోళన న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు కదులుతున్న రైతులు సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ రాజధాని గ్రామాల్లో ఒకటైన అనంతవరంలో భూములను భోంచేసే ‘పథకం’ ఈనాటిది కాదు. రాజధాని ప్రకటన నాటి నుంచే పథకం పన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా సెంట్ల రూపంలో పెద్ద ఎత్తున భూములను మింగేశారు. రికార్డుల్లో తారుమారు చేసిన భూములను సైతం కొందరు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ‘సాక్షి’ కథనంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయంపై గొంతెత్తుతున్నారు. రెండేళ్ల నుంచి సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని, పత్రికలకు ఎక్కితే కేసులుపెట్టి జైల్లో పెడతామని బెదిరించారని వారు చెబుతున్నారు. అంతేకాదు భూ అక్రమాలపై రాజధాని పరిధిలోని పలు గ్రామాల నుంచి బాధితులు ‘సాక్షి’ ప్రతినిధులకు ఫోన్లు చేసి అనంతవరం తరహాలోనే తమకూ అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని కోరుతున్నారు. సీఆర్డీఏ అధికారులు, టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు నిరసనగా రైతులంతా చేతులు కలుపుతున్నారు. అనంతవరం గ్రామంలో సుమారు 50 ఎకరాల భూమిని సర్కారు పెద్దలు మింగేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఆక్రమణలను చూసి మనస్తాపంతో ఇదే గ్రామానికి చెందిన రాంబాబు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దాంతో ఈ భూ దందా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అవినీతి సెంట్ల వ్యవహారంపై ‘సాక్షి’ తీగలాగటంతో డొంకంతా కదులుతోంది. అవినీతికి పాల్పడి.. పైగా రైతులకు బెదిరింపులు రాజధాని నిర్మాణం పేరుతో అనంతవరం గ్రామంలోని 1,963 మంది రైతుల నుంచి రాష్ట్రప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 2,523 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఇపుడు అధికార పార్టీ నేతలు రైతులకు నష్టపరిహారం కింద చెల్లించే ప్లాట్లు, కౌలుపై కన్నేశారు. గ్రామానికి చెందిన అనేక మంది రైతుల భూములను సెంట్ల రూపంలో కొట్టేశారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులను కలసి రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పైగా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. నోరెత్తితే కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. రాంబాబు అనే వ్యక్తి మాత్రం బైటకొచ్చి తనకున్న 47 సెంట్లలో 3 సెంట్లు మాయం చేశారంటూ సీఆర్డీఏ అధికారులను ఆశ్రయించారు. ఆ 3 సెంట్లకు సంబంధించి కౌలు చెల్లిస్తాం, ఎవ్వరికీ చెప్పొద్దని సీఆర్డీఏ అధికారులు రాజీ చేసే ప్రయత్నం చేశారు. తనకు కౌలుతో పాటు 3 సెంట్ల భూమి కూడా రికార్డుల్లో చేర్చాలని రాంబాబు డిమాండ్ చేశారు. అయితే అధికారులు అంగీకరించకపోవటంతో తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రాంబాబు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న రాజధాని గ్రామాల రైతులు తమ రికార్డులను తెప్పించుకుని చూశారు. అనంతవరంతో పాటు రాయపూడి, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, దొండపాడు, పెనుమాక, కృష్ణాయపాలెం, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లోనూ రైతుల భూముల్లో నుంచి సెంట్లు చొప్పున భూములు మాయమయ్యాయని తెలుస్తోంది. సాక్షిలో ఆదివారం ‘రాజధాని గ్రామాల్లో అవి నీతి సెంటు’ శీర్షికన వచ్చిన కథనం చూసి రైతులంతా ఫోన్లు చేస్తున్నారు. తమ భూమిలో నుంచి కూడా కొంత భూమిని మాయం చేశారని, న్యాయం చేయాలని కోరుతున్నారు. మళ్లీ రికార్డుల తారుమారు రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లో సెంట్ల చొప్పున తగ్గించిన వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలతో ఉలిక్కిపడ్డ టీడీపీ నాయకుడొకరు ఆదివారం రాత్రి రికార్డులను తారుమారు చేశారు. అనంతవరం గ్రామానికి చెందిన పారా సీతారామయ్య పేరున సర్వే నంబర్ 287లో 82 సెంట్లు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చినట్లు గతంలో రికార్డులు సృష్టించారు. అయితే ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలతో అదే 287 సర్వే నంబర్లో నాదెండ్ల పద్మావతి పేరు చేర్చారు. ఆమె సీఆర్డీఏకు 282 సెంట్లు ఇచ్చినట్లు రికార్డులు తారుమారు చేశారు. అలాగే 237/1లో పారా సామ్రాజ్యం 20 సెంట్లు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చినట్లు గతంలో మార్పులు చేశారు. సాక్షి కథనాలతో సీఆర్డీఏ వెబ్సైట్లో ఉన్న పారా సామ్రాజ్యం పేరును తొలగించి ఇతరులు అని చేర్పించారు. పారా సీతారామయ్య కుమారుడు రాజధాని కమిటీలో సభ్యుడు కావడం గమనార్హం. కాగా పస్తుతం ‘సాక్షి’ వద్ద ఉన్న రికార్డులు తప్పు అని చూపించి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తారుమారు చేసి కొట్టేసిన భూములు అమ్మేశారు యడ్లూరి సాంబశివరావుకు సర్వే నంబర్ 100ఈలో 1.24 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి 44 సెంట్ల భూమి మాయమైంది. అదే భూమిని స్థానిక టీడీపీ నాయకులు నలుగురు కలసి ఉప్పాల జ్ఞానేశ్వరికి అమ్మి సొమ్ము చేసుకున్నారు. అదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావుకు చెందిన 2.64 ఎకరాల్లో నుంచి 25 సెంట్లు మాయం చేసి గుంటూరు జిల్లా రాజోలుకు చెందిన వెంకటేశ్వర్లుకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చందోలు పూర్ణచంద్రరావుకు 120ఎ లో 1.88 సెంట్లు భూమి ఉంది. అందులో 11 సెంట్లను మాయం చేసి వేరొకరికి కట్టబెట్టినట్లు పూర్ణచంద్రరావు ఆరోపించారు. సుంకర విజయకుమారి, గోపిదేశి మీరాకుమారితో పాటు పలువురు గ్రామస్తులంతా ‘సాక్షి’ ప్రతినిధులకు రికార్డులను చూపించి సీఆర్డీఏ, రెవెన్యూ, స్థానిక టీడీపీ నేతలు చేసిన దారుణాలను వివరించారు. ఈ భూములను మాయం చేసి వేరొకరికి అప్పగించేందుకు రైతుల పేర్లు, వేలిముద్రలను ఫోర్జరీ చేసినట్లు యర్రా వెంకాయమ్మ ఆరోపించారు. ఇదిలా ఉంటే శాఖమూరులో సర్వే నంబర్ 86/ఏలో 2.40 ఎకరాల భూమిని 1972లో 44 మంది దళిత గిరిజన కుటుంబాలకు 4 సెంట్లు పంపిణీ చేశారు. ఈ మొత్తం భూమిని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడొకరు గుట్టుచప్పుడు కాకుండా ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చేశారు. రాయపూడిలో 140 మంది రైతుల భూముల నుంచి కొంత భూమి మాయం చేసినట్లు ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. రాజధాని గ్రామాల నుంచి అనేక మంది బాధితులు బయటకు వస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు. -
వినాయక నిమజ్జనానికి వెళ్లి వచ్చేసరికి..
గుంటూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి అందినకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి... గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపును చూసేందుకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 70 సవర్ల బంగారంతోపాటు రూ. 25 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన వెంకటేశ్వరరెడ్డి కుటుంబసభ్యులు చోరీ జరిగినట్లు గుర్తించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పవన్ కల్యాణ్ స్పందించాలంటూ ఫ్లెక్సీలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు తమ పొలాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని పొలాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. ప్రభుత్వ బలవంతపు భూ సేకరణపై పవన్ స్పందించాలంటూ ఫ్లెక్సీల్లో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భూములు ఇవ్వమని ఎన్ని సార్లు చెప్పినా తమను భయపెట్టడానికి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. మూడు పంటలు పండే భూములను కాపాడుకునేందుకు పోరాడుతున్నామని...తమకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, సబ్సిడీలు కూడా ఆపేశారని తమ బాధను వెల్లడించారు. సీడ్ క్యాపిటల్ పరిధిలో తమ గ్రామాలు లేకపోయినా భూములను టార్గెట్ చేశారన్నారు. ప్రాణాలు పోయినా సరే..తమ భూములను వదులుకోమని దీనిపై పవన్ కల్యాణ్ స్పందించాలని కోరుతున్నట్లు ఫ్లెక్సీల్లో తెలిపారు. గతంలో రాజధాని రైతులను ఆదుకుంటానని పవన్ స్వయంగా గ్రామాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. -
మళ్లీ భూసేకరణకు తెర తీశారు
విజయవాడ: ఏపీ రాజధాని గ్రామాలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఉండవల్లి, పెనుమకలో భూసేకరణ చేయడానికి రంగం సిద్ధమైంది. భూసేకరణ చట్టంపై ఉండవల్లి పెనుమకలో రాత్రిరాత్రే పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వం పేరిట ఇవి దర్శనం ఇచ్చాయి. ఈ భూసేకరణకు సంబంధించి పెనుమకలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. -
రాజధానిలో ఆగని కక్షసాధింపు చర్యలు
రైతుల అనుమతి లేకుండా సర్వేలు సర్వే కర్రలు పీకేస్తున్న రైతులు తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామాలైన గుంటూరు జిల్లాలోని ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం తదితర ప్రాంతాల్లో భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం నిరంతరం ఏదో విధంగా భయభ్రాంతుల్ని చేస్తూనే ఉంది. బుధవారం కొత్తగా మళ్లీ ప్రైవేటు సర్వేయర్లను ఏర్పాటు చేసి సర్వే చేయించి కర్రలు పాతారు. ఈ తంతు అంతా రైతులు పొలాల్లో లేనప్పుడు మాత్రమే చేస్తున్నారు. ఇది తెలుసుకున్న రైతులు సర్వే చేసి కర్రలు పాతుతున్నవారిని అడ్డుకుని తమ పొలాల్లో కర్రలు ఎందుకు పాతుతున్నారని ప్రశ్నిస్తే సీఆర్డీఏ అధికారుల సూచన మేరకు సర్వేచేసి కర్రలు పాతుతున్నట్లు చెబుతున్నారు. గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయ ఉద్యోగులను రైతులు ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని వారు సమాధానం ఇస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసిన సర్వే పుల్లలను పీకేస్తున్నారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని సుమారు 80 ఎకరాలకు సర్వే నిర్వహించి, కర్రలు పాతారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వాటిని పీకేశారు. పెనుమాకలో రైతులు తిరగబడేందుకు సిద్ధమవడంతో సర్వేయర్లు వెళ్లిపోయారు. పూలింగ్‌కు ఇవ్వని పొలాల్లో ఎలా సర్వే చేస్తారు? రాజధానికి భూములు ఇవ్వకపోవడంతో మొదటి నుంచి ప్రభుత్వం రైతులను ఏదో విధంగా భయాందోళనలకు గురిచేస్తోంది. కొత్తగా ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ హైవే అంటూ పచ్చని పంట పొలాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. కరకట్ట వెంబడి పూలింగ్‌కు ఇచ్చిన పొలాలున్నాయి. వాటిలో రోడ్లు నిర్మించకుండా పూలింగ్‌కు ఇవ్వని పొలాల్లో రోడ్లు ఎలా నిర్మిస్తారు? ఎలా సర్వే చేస్తారు? సీఆర్డీఏ అధికారులే తేల్చాలి. - బత్తుల శంకర్, ఉండవల్లి రైతులు తిరగబడేరోజు దగ్గర్లో ఉంది రైతుల సహనాన్ని సీఆర్డీఏ అధికారులు చేతగాని తనం అనుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకుండా వ్యవసాయాధికారులు సలహాలు ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి రైతులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. - విశ్వనాథరెడ్డి, పెనుమాక అన్నదాత తెగబడతాడు కోర్టులను ఆశ్రయించాం.. తీర్పు రైతులకు అనుకూలంగా ఇచ్చింది. అయినా ప్రభుత్వం రైతులను భయభ్రాంతుల్ని చేయడం మానడంలేదు. ఇలాగే ప్రభుత్వం చేస్తుంటే కడుపు మండిన అన్నదాత తెగబడతాడు. ప్రభుత్వం అది గమనించాలి. రైతుకు పంటలో నష్టం వస్తే తిరిగి మళ్లీ పంట వేస్తాడు తప్ప పొలాన్ని అమ్ముకోడు. అలాంటి మమ్ములను రాజధాని పేరుతో ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. - గాదె సాంబశివరావు, ఉండవల్లి -
అనుమతిలేని క్వారీ.. అక్రమాల దారి
కోర్టు ఆదేశాలు బేఖాతరు అనుమతులు లేకుండానేయథేచ్ఛగా అమ్మకాలు పనిచేయని సీసీ కెమెరాల వెనుక మర్మమేమిటి? తాడేపల్లి రూరల్ : కోర్టు ఆదేశాలకు తిలోదకాలిచ్చి పెనుమాక ఇసుక రీచ్‌లో బుధవారం యథేచ్ఛగా ఇసుక అమ్మకాలు జరిపారు. ప్రభుత్వం తరఫున క్వారీ నిర్వహణా బాధ్యతలు చూసే ఏసీఎం శ్రీధర్ అనుమతితోనే ఇదంతా జరిగిందని, డీఆర్డీఏ పీడీ బి.శ్రీనివాసరావు ఇసుక అమ్మకాలు నిర్వహించమన్నట్టు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తమకు అందాల్సిన లెక్కల్లో తేడాలు రావడంతో సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లు అధికారులను వెంటబెట్టుకుని క్వారీలో హల్చల్ చేశారు. దీంతో కంగారు పడిన ఏపీఎం లోడింగ్‌ను నిలిపివేశారు. రెవెన్యూ అధికారి దుర్గారావు, ఎస్ఐ వినోద్‌కుమార్ అనుమతి పత్రాలు చూపించమని కోరడంతో ఏపీఎం శ్రీధర్ మాత్రం తమ వద్ద పత్రాలు లేవని, జిల్లా డీఆర్డీఏ పీడీ అనుమతి ఇచ్చారంటూ జవాబిచ్చారు. దీంతో క్వారీ నిర్వహించవద్దంటూ సూచించి ఎటువంటి చర్యలు తీసుకోకుండానే అధికారులు వెనుదిరిగారు. ‘నిఘా’ నిర్వాహకుల చేతుల్లోనే.. ఇసుక క్వారీలో అక్రమాలు జరక్కుండా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలు నిర్వాహకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయి. బుధవారం ఉదయం సీసీ కెమెరాలు పాడయ్యాయని చెప్పిన నిర్వాహకులు.. అధికారుల రాకతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఉదయం కరకట్ట రోడ్డు దృశ్యాలను చూపిన కెమారాలు అధికారులు వచ్చేసరికి క్వారీ నిర్వహణను చూపిస్తున్నాయి. అంటే అక్రమాలను కప్పిపుచ్చడానికే సీసీ కెమెరాలను నిర్వాహకులు తమకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. మొదటి నుంచీ పెనుమాక క్వారీలో అక్రమాలు జరుగుతున్నా కన్నెత్తి చూడని రెవెన్యూ, పోలీస్ అధికారులు స్థానికి టీడీపీ నాయకులు ఆరోపిస్తే గానీ క్వారీకి రాకపోవడం విడ్డూరం. స్వయానా అధికార పార్టీ నాయకులే క్వారీ నిర్వహణపై ఆరోపణలు చేస్తుంటే ఇక్కడ అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొసమెరుపు ఏమిటంటే.. పెనుమాక ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టడానికి టీడీపీ మండల నాయకులు ఆరు నెలల తరువాత నోరు విప్పడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయన్న సదరు నేత గ్రామంలో రాత్రీ పగలూ తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే.. స్థానిక యువకులు ఫిర్యాదు చేశారంటూ వారిపై దాడికి పాల్పడడమే కాకుండా, ఆయనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. ఇప్పుడు మాత్రం తాము నీతిమంతులమంటూ ఇసుక అక్రమాలను అడ్డుకుంటాం.. సీఎం దృష్టికి తీసుకువెళ్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆ ప్రకటనలు కూడా తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను టార్గెట్ చేసుకుని మాట్లాడారు. ఎమ్మెల్యే అనుచరులు స్థానిక టీడీపీ నేతలకు వాటా ఇవ్వకుండా ఇసుక రీచ్ నిర్వహించడం వల్లే ఈ తతంగం జరుగుతోందని డ్వాక్రా మహిళలే విమర్శిస్తున్నారు. క్వారీలో అక్రమాలు జరిగాయని సాక్ష్యాలు ఉన్నప్పుడు ఎందుకు బయటపెట్టడం లేదో అర్థం కావడం లేదంటూ బోట్మన్ సొసైటీ సభ్యులు వ్యాఖ్యానించడం గమనార్హం. -
'ప్రభుత్వం భూములు లాక్కొంటుంది'
విజయవాడ: ప్రభుత్వం తమ నుండి బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తుదని ఆరోపిస్తూ ఉండవల్లి, పెనుమాకకు చెందిన రైతులు శుక్రవారం సీఆర్డీఏ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. భూములు రైతులు ఇష్టపూర్తిగా ఇస్తేనే తీసుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేపడుతోందని విమర్శించారు. చిన్న, సన్నకారు రైతులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము ఇవ్వని భూములను కూడా రాజధాని ప్లాన్‌లో చూపించారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. -
రైతుల పొట్టకొట్టి రాజధాని నిర్మిస్తారా ?
-
'పవన్ కల్యాణే న్యాయం చేయాలి'
గుంటూరు : జననేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నమ్మకంతోనే తాము గత ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేశామని రాజధాని ప్రాంత భూముల రైతులు స్పష్టం చేశారు. మీరే మాకు న్యాయం చేయాలని వారు పవన్ కల్యాణ్‌కు స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా పెనుమాకలో రాజధాని ప్రాంత భూముల రైతులు, కౌలు రైతులతో పవన్ కల్యాణ్ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా వారు పవన్ కల్యాణ్ ఎదుట తమ గోడు వెళ్లపోసుకున్నారు. రాజధాని కోసం చంద్రబాబు చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌పై తమకు స్పష్టత లేదని ఆరోపించారు. ఎర్రబాలెంలోని తమ భూములు తీసుకుని జగ్గయ్యపేటలో తమకు భూములు ఇస్తామంటే ఎలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా భూములు మాకు వదిలేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భూముల సేకరణపై ప్రభుత్వం ప్రకటినలతో తిండి తినడం లేదు ... నిద్ర పోవడం లేదన్నారు. 20 సెంట్ల భూముల్లో మల్లి తోటల ద్వారా ఈ సీజన్లో రోజుకు 5 వేలు సంపాదిస్తున్నామని ఎర్రుబాలెం రైతు కన్నీటి పర్యంతమయ్యారు. అలాంటి భూమిని సీఆర్డీఏకి ఇస్తే రూ. 30 వేల పరిహారం ఇస్తామంటున్నారని ఆవి ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. మూడు పంటలు పండే భూమి ఇస్తే మేము ఎలా బతకాలన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తాము ఏనాడు చూడలేదని .. చంద్రబాబును ఉద్దేశించి రైతు వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారని పంపినా ... మన వాళ్ల పాలనలో తమకు న్యాయం జరుగడం లేదని రైతులు బాధపడుతున్నారు. -
రైతుల పొట్టకొట్టి రాజధాని నిర్మిస్తారా ?
గుంటూరు : రైతుల పొట్టకొట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని కడతారా అని ఉండవల్లి గ్రామ రైతు గంగిరెడ్డి శివశంకరరావు ప్రశ్నించారు. ఆదివారం పెనుమాకలో పవన్ కల్యాణ్ ఎదుట శివశంకరరావు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంలో టీడీపీకి ఎప్పుడూ ఓటు వేయలేదన్నారు. కానీ మీరు చెప్పారని గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశామని చెప్పారు. గతంలో చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చుక్క నీరు లేకపోయినా... తమ ప్రాంతంలో మూడు పంటలు పండించామన్నారు. మండు వేసవిలో కూడా తమ ప్రాంతం చల్లగా ఉంటుందన్నారు. కృష్ణా జిల్లా నుంచి 30 ఏళ్ల క్రితం తాము ఇక్కడికి వలస వచ్చామని తెలిపారు. తమకు 10 మంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు. భూమి ఇస్తే తాము ఎలా బతకాలంటూ పవన్ కల్యాణ్ ఎదుట శివశంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
-
సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల రైతుల ఆందోళన కొనసాగుతోంది. తాడేపల్లి మండలం పెనుమాకలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద మంగళవారం రైతులు నిరసనకు దిగారు. గతంలో తాము ఇచ్చిన భూముల అంగీకార పత్రాలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామని స్థానిక అధికారులు చెబుతున్నారు. -
మా భూములివ్వం...
ముగ్గులతో నిరసన తెలిపిన మహిళలు తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన ఉండవల్లి, పెనుమాకలో సంక్రాంతి కళ తప్పింది. భోగి మంటలతో ప్రారంభమయ్యే సంక్రాంతి నిరసనలతో ప్రారంభమైంది. తమ నిరసనను ముగ్గుల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఏటా సంక్రాంతి పండుగను రైతులు ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. కానీ ఈ ఏడాది రైతు కుటుంబాల్లో సంక్రాంతి హడావుడి కనిపించడంలేదు. రాజధాని పేరిట తమ భూములను కోల్పోయే పరిస్థితి రావడంతో వారిలో ఈ ఏడాది ఆనందం కరువైంది. తమకు ఇష్టం లేకున్నా ల్యాండ్ పూలింగ్ పేరిట బలవంతంగానైనా ప్రభుత్వం భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తుండడం వారిలో ఆవేదనను కలిగించింది. దీంతో ఈ గ్రామాల్లోని రైతులు తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతిని ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ ఏడాది పెనుమాక, ఉండవల్లి రైతుల ఇంట సంక్రాంతి శోభ కానరావడం లేదు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం పెనుమాక, ఉండవల్లి రైతుల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఇక్కడి రైతులు ఏదో ఒక రూపంలో నిరసనలు తెలియజేస్తున్నారు. అయినా సర్కారు తన నిర్ణయూన్ని వెనక్కు తీసుకోలేదు. మూడురోజుల నుంచి పెనుమాక, ఉండవ ల్లి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని భూమి ఇచ్చే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. మరోవైపు గ్రామాల్లో పోలీసు పికెట్‌ను ఏర్పాటుచేశారు. గత 50 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా పెనుమాక , ఉండవల్లివాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇవ్వలేమని నిరసనలు వ్యక్తం చేస్తూ భోగి పండుగ రోజున రెండు గ్రామాల మహిళలు ముగ్గుల రూపంలో తమ వాణిని ప్రభుత్వానికి వినిపించారు. భూములిచ్చే ప్రసక్తే లేదని ముగ్గుల ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా ఏ రైతు కుటుంబాన్ని కదిలించినా ఆవేదనతో కూడిన మాటలు వినపడుతున్నాయి. విషయం తెలుసుకున్న మీడియూ ప్రతినిధులు ఆ గ్రామాలను సందర్శించగా వారినుద్దేశించి రైతులు మాట్లాడుతూ.. చంద్రబాబు తమ గ్రామాల మీద కక్షకట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూములు ఇవ్వనన్న తమపై బలప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నారని వాపోయూరు. గ్రామంలో పోలీసు పికెట్ పెట్టి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను అర్ధం చేసుకోవాలన్నారు. -
ఏపీ రాజధాని ప్రాంత రైతుల వినూత్న నిరసన
గుంటూరు: ఏపీ ప్రభుత్వం రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తోంది. కొత్త రాజధాని నిర్మాణానికి భూ సేకరణ విషయంలో ఆ ప్రాంత రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పరిధిలోని తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వం అని పోలాల వద్ద రైతులు బోర్డులు ఏర్పాటు చేశారు. మొదటి నుంచి ఈ ప్రాంత రైతులు మూడు పంటలు పండే తమ భూములు ఇవ్వం అని చెబుతున్నారు. తాము ఎటువంటి పరిస్థితులలోనూ భూములు ఇచ్చేదిలేదని వారు స్పష్టం చేశారు. ** -
పెనుమాక, ఉండవల్లిలో భూసేకరణ వద్దు
తాడేపల్లి: గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లిలో భూసేకరణ జరుపరాదంటూ, మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. తాడేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి ఆధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో రాజధాని భూసేకరణలో భాగంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతుల పంట పొలాలు తీసుకోరాదంటూ తీర్మానాన్ని మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బురదగుంట కనకవల్లి ప్రతిపాదించారు. దీనికి ఎంపీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే, మండల పరిధిలో ఉన్న 13 ప్రాదేశిక నియోజకవర్గాల అభివృధ్ధికి రూ.26 లక్షలు కేటారుుస్తున్నట్టు రాజ్యలక్ష్మి ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు దండమూడి శైలజారాణి, ఇన్ చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు పాటిబండ్ల కృష్ణమూర్తి, మేకా హనుమంతరావు, డి.బ్రహ్మానందరావు, ఈదులమూడి శేఖర్, బిరుదుగడ్డ శేషయ్య, అన్నుల దేవి, బి.స్వర్ణకుమారి, గరిక అనిత, జముడుగలిన సుబ్బాయమ్మ, గోడవర్తి సంధ్యాదేవి, సర్పంచులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు అన్నదాతల లేఖలు భూసేకరణ పేరుతో తమకు అన్యాయం చేయొద్దంటూ గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 1,001 ఉత్తరాలు రాశారు. రాజధాని భూసేకరణ పేరుతో ఏడాదికి మూడు పంటలు పండే, సారవంతమైన భూములు ఇవ్వడం తమకు ఇష్టం లేదని, చట్టబద్ధత లేని ల్యాండ్‌పూలింగ్ విధానం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతామని ఆ లేఖల్లో పేర్కొన్నారు. విజయవాడ తమ ప్రాంతాలకు 2 కిలోమీటర్ల పరిధిలో ఉండటం వల్ల భవిష్యత్తులో ఇంతకంటే మంచి రేట్లు వస్తాయని, అలాంటప్పుడు, తమ పంట భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమని వారు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా భూములను ల్కాంటే, ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని పునరుద్ఘాటించారు. -
మా సమాధులపై రాజధాని కడతారా?
-
మా సమాధులపై రాజధాని కడతారా?
* రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతుల ఆగ్రహం * చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారంటూ మండిపాటు * రైతుల అభిప్రాయాలు సేకరించిన విజయవాడ, గుంటూరు * బార్ అసోసియేషన్ల సభ్యులు తాడేపల్లి: మా సమాధులపై రాజధాని కడతారా అంటూ రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతులు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పైన మండిపడ్డారు. మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు రైతులతో సమావేశం నిర్వహించారు. రాజధానికి భూములిచ్చే విషయంలో రైతుల అభిప్రాయూలను వారు సేకరించారు. తుళ్లూరు, మంగళగిరి మండలాల రైతులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వంపైన, సీఎంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా భూములు లాక్కొని మా పొట్టలు కొడతారా? మమ్మల్ని, మా కుటుంబాలను రోడ్లపైకి నెడతారా? మా సమాధులపై అందమైన రాజధాని కడతావా బాబూ...!’ అంటూ మండిపడ్డారు. ల్యాండ్‌పూలింగ్ పద్ధతిలో రాజధానికి భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారంటూ కొన్ని పత్రికల్లో, చానళ్లలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అదంతా చంద్రబాబు మైండ్‌గేమ్‌లో భాగమేనని వ్యాఖ్యానించారు. రైతులు చెప్పిన విషయాలను విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సదరం శ్రీనివాసరావు, కార్యదర్శి రవికుమార్, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యుడు మల్లెల శేషగిరిరావు నమోదు చేసుకున్నారు. రైతుల అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ సభ్యులు సి.వి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ సొసైటీ అధ్యక్షుడు మేకా శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్లకు రైతులు ఇచ్చిన డిమాండ్లు ఇవీ.. * భూసేకరణపై నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి. * ఎకరా భూమికి ఎంత చెల్లిస్తారో కచ్చితంగా చెప్పాలి. ప్రతి ఎకరాకు అభివృద్ధి చేసిన భూమిలో 1,500 గజాల స్థలం ఇవ్వాలి. అదీ ప్రస్తుతం భూమి తీసుకుంటున్న ప్రాంతంలోనే ఇవ్వాలి. * రోడ్లు, కరకట్టలకు ఆనుకుని భూములున్న రైతులకు భూసేకరణ అనంతరం అభివృద్ధి చేసి ఇచ్చే భూమిని కూడా రోడ్డు పక్కదే ఇవ్వాలి. అదీ ఎంతకాలంలో ఇస్తారో చెప్పాలి. * ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో సారవంతమైన 3 పంటలు పండే భూముల్లో కౌలు రూ. 50 వేల వరకు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరిహారం కూడా ప్రభుత్వం చెప్పే కాలపరిమితి మెుత్తాన్ని లెక్కించి ఒకేసారి ఇవ్వాలి. * ఇవన్నీ హామీలుగా కాక శాసనసభలో చట్టం చేసిన తరువాతే భూసేకరణకు చర్యలు ప్రారంభించాలి. -
‘బెంచి’పై ఘర్షణ; తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి
తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: క్లాసులో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన గురువారం గుంటూరు జిల్లా పెనుమాక జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగింది. తాడేపల్లి పోలీసుల కథనం ప్రకారం పెనుమాకకు చెందిన గుజ్టుల చంద్రశేఖర్‌రెడ్డి తొమ్మిదో తరగతి విద్యార్థి. గురువారం ఉదయం స్కూల్‌కు వచ్చి, ఇంకా తరగతులు ప్రారంభం కాకపోవడంతో క్లాసులో ఆడుకుంటూ బెంచిపెకైక్కాడు. బెంచి ఎక్కడం తప్పని తోటి విద్యార్థి ఈశ్వర్కళ్యాణ్ మందలించడంతో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో ఈశ్వర్కళ్యాణ్ షర్టు చిరగడంతో కోపం పట్టలేక చాచిపెట్టి చంద్రశేఖర్‌ను గూబపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా చంద్రశేఖర్‌రెడ్డి కుప్పకూలాడు. తోటి విద్యార్థులు వెంటనే వెళ్లి డ్రిల్ మాస్టారుకు చెప్పారు. ఆయన హుటాహుటిన వచ్చి పరిశీలించేసరికి చంద్రశేఖర్‌రెడ్డి ప్రాణం పోయింది. మృతదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి విచారణ జరిపి సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు.