'పవన్ కల్యాణే న్యాయం చేయాలి'
గుంటూరు : జననేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై నమ్మకంతోనే తాము గత ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేశామని రాజధాని ప్రాంత భూముల రైతులు స్పష్టం చేశారు. మీరే మాకు న్యాయం చేయాలని వారు పవన్ కల్యాణ్కు స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా పెనుమాకలో రాజధాని ప్రాంత భూముల రైతులు, కౌలు రైతులతో పవన్ కల్యాణ్ సమావేశమైయ్యారు.
ఈ సందర్భంగా వారు పవన్ కల్యాణ్ ఎదుట తమ గోడు వెళ్లపోసుకున్నారు. రాజధాని కోసం చంద్రబాబు చేపట్టిన ల్యాండ్ పూలింగ్పై తమకు స్పష్టత లేదని ఆరోపించారు. ఎర్రబాలెంలోని తమ భూములు తీసుకుని జగ్గయ్యపేటలో తమకు భూములు ఇస్తామంటే ఎలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా భూములు మాకు వదిలేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
భూముల సేకరణపై ప్రభుత్వం ప్రకటినలతో తిండి తినడం లేదు ... నిద్ర పోవడం లేదన్నారు. 20 సెంట్ల భూముల్లో మల్లి తోటల ద్వారా ఈ సీజన్లో రోజుకు 5 వేలు సంపాదిస్తున్నామని ఎర్రుబాలెం రైతు కన్నీటి పర్యంతమయ్యారు. అలాంటి భూమిని సీఆర్డీఏకి ఇస్తే రూ. 30 వేల పరిహారం ఇస్తామంటున్నారని ఆవి ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు.
మూడు పంటలు పండే భూమి ఇస్తే మేము ఎలా బతకాలన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తాము ఏనాడు చూడలేదని .. చంద్రబాబును ఉద్దేశించి రైతు వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారని పంపినా ... మన వాళ్ల పాలనలో తమకు న్యాయం జరుగడం లేదని రైతులు బాధపడుతున్నారు.