
రాజధాని, పోలవరం రైతులతో పవన్ భేటీ
రాజధాని, పోలవరం ప్రాంత రైతులతో హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు.
సాక్షి, అమరావతి: రాజధాని, పోలవరం ప్రాంత రైతులతో హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల తాము నష్టపోతున్నామని ఆయా ప్రాంత రైతులు పవన్‌కు వివరించారని పార్టీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రైతుల బాధలు విన్న పవన్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగకూడదు.. అలాగే ప్రజలు కూడా నష్టపోకూడదని చెప్పారని పేర్కొన్నారు. అవసరమైతే రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటిస్తారని తెలిపారు.