సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పొలాలు లాక్కునేందుకు భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ప్రభుత్వానికి ఎదురుతిరగాలని రైతులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. ఆయన ఆదివారం అమరావతి ప్రాంత రైతులతో సమావేశమయ్యారు. మూడు పంటలు పండే భూములను ప్రభుత్వం సేకరించకూడదని ఆయన అన్నారు. మూడు పంటలు పండే భూముల్ని మెట్ట పొలాలుగా చూపి దోపిడీ చేస్తారా అని ఆయన సర్కారును నిలదీశారు. మంత్రి నారాయణ పంట భూములను ట్రాక్టర్లతో దున్నారని, ఆయనకు రైతుల గురించి, వ్యవసాయం గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే భూదాహం తగ్గించుకోవాలని హితవు పలికారు. రైతుల భూములను ప్రభుత్వం అడ్డంగా దోచుకుంటోందని, రాజధాని గ్రామాల్లో నియతృత్వంతో వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సింగూరు పోరాటం, బషీర్‌బాగ్ కాల్పుల వంటి ఘటనలు పునరావృతం కావాలని ప్రభుత్వం కోరుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment