'ట్వీట్లు కాదు.. అక్కడికి వెళ్లు పవన్'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు.. జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్కు సవాల్ విసిరారు. ట్విట్టర్లో సందేశాలు ఇస్తూ ఇంట్లో కూర్చోవడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి వెళ్లి రైతులను ఆదుకోవాలని వీహెచ్.. పవన్కు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకుంటోందని వీహెచ్ ఆరోపించారు. పవన్ కల్యాణ్ వెంటనే అక్కడి వెళ్లి ఆపాలని వీహెచ్ అన్నారు. గుంటూరు జిల్లాలో ఏపీ రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దంటూ పవన్ ట్విట్టర్లో ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీహెచ్ పైవిధంగా స్పందించారు.