విజయవాడ: ప్రభుత్వం తమ నుండి బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తుదని ఆరోపిస్తూ ఉండవల్లి, పెనుమాకకు చెందిన రైతులు శుక్రవారం సీఆర్డీఏ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు.
భూములు రైతులు ఇష్టపూర్తిగా ఇస్తేనే తీసుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేపడుతోందని విమర్శించారు. చిన్న, సన్నకారు రైతులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము ఇవ్వని భూములను కూడా రాజధాని ప్లాన్లో చూపించారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.