తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: క్లాసులో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన గురువారం గుంటూరు జిల్లా పెనుమాక జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగింది. తాడేపల్లి పోలీసుల కథనం ప్రకారం పెనుమాకకు చెందిన గుజ్టుల చంద్రశేఖర్‌రెడ్డి తొమ్మిదో తరగతి విద్యార్థి. గురువారం ఉదయం స్కూల్‌కు వచ్చి, ఇంకా తరగతులు ప్రారంభం కాకపోవడంతో క్లాసులో ఆడుకుంటూ బెంచిపెకైక్కాడు. బెంచి ఎక్కడం తప్పని తోటి విద్యార్థి ఈశ్వర్‌కళ్యాణ్ మందలించడంతో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది.
ఘర్షణలో ఈశ్వర్‌కళ్యాణ్ షర్టు చిరగడంతో కోపం పట్టలేక చాచిపెట్టి చంద్రశేఖర్‌ను గూబపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా చంద్రశేఖర్‌రెడ్డి కుప్పకూలాడు. తోటి విద్యార్థులు వెంటనే వెళ్లి డ్రిల్ మాస్టారుకు చెప్పారు. ఆయన హుటాహుటిన వచ్చి పరిశీలించేసరికి చంద్రశేఖర్‌రెడ్డి ప్రాణం పోయింది. మృతదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి విచారణ జరిపి సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు.
‘బెంచి’పై ఘర్షణ; తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి
Published Fri, Sep 20 2013 4:13 PM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
Advertisement
Advertisement