
ఏపీ రాజధాని ప్రాంత రైతుల వినూత్న నిరసన
గుంటూరు: ఏపీ ప్రభుత్వం రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తోంది. కొత్త రాజధాని నిర్మాణానికి భూ సేకరణ విషయంలో ఆ ప్రాంత రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పరిధిలోని తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేస్తున్నారు.
ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వం అని పోలాల వద్ద రైతులు బోర్డులు ఏర్పాటు చేశారు. మొదటి నుంచి ఈ ప్రాంత రైతులు మూడు పంటలు పండే తమ భూములు ఇవ్వం అని చెబుతున్నారు. తాము ఎటువంటి పరిస్థితులలోనూ భూములు ఇచ్చేదిలేదని వారు స్పష్టం చేశారు.
**