సాక్షి, అమరావతి : తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారంటూ ఉండవల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు.
దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. హైటెన్షన్ లైన్ ఏర్పాటు వ్యతిరేకంగా రైతులు పురుగుల మందు తాగేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment