
సాక్షి, గుంటూరు: వరద ముంపు నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి వీఆర్వో ప్రసాద్ శనివారం నోటీసులిచ్చారు. వరద ముప్పు కారణంగా ఇప్పటికే కరకట్టను ఆనుకొని ఉన్న 32 ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా చంద్రబాబు నివాసానికి నోటీసులివ్వడానికి వెళ్లిన వీఆర్వోను ఇంట్లో ఎవరు లేరంటూ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకుండా బయటనే నిలిపివేశారు. సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడిన వీఆర్వో వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని సూచించినట్లు తెలిపారు.
నీట మునిగిన పంటలు
ఎగువ నుంచి వస్తున్న వరదలతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. దాచేపల్లి మండలం రామపురం, మాచవరం మండలంలోని రేగులగడ్డ, అచ్చంపేట మండలం మదిపాడు, గింజపల్లి,జీడిపల్లి, తాండువాయి,చల్లగరిగ, దామర్ల, కోడూరు గ్రామాల్లో పత్తి, మిరప పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. అదే విధంగా కొల్లిపొర మండలం పాతబొమ్మవానిపాలెం, అన్నవరపులం, కొల్లూరు మండలం ఆవులవారిపాలెం, పెసర్ల, పోతారం, జువ్వలపాలెం,ఈపురు తదితర గ్రామాల్లో అరటి, పసుపు, తమలపాకు పంటలకు పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment