
పాలించే హక్కు కోల్పోయింది
ఏపీ సర్కార్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి ఫైర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పాలించే హక్కును చంద్రబాబు సర్కారు కోల్పోయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర స్థారుులో ధ్వజమెత్తారు. కేంద్రంతో మాట్లాడి పునర్ విభజన చట్టంలోని అంశాలు అమలు చేరుుంచుకోకుండా రెండున్నరేళ్లుగా ప్రచార ఆర్భాటాలతోనే కాలం గడుపుతోందని విమర్శించారు. ఒక ఏడాది గోదావరి, మరో ఏడాది కృష్ణా పుష్కరాలతో కాలం గడిపిందన్నారు. పోలవరం కట్టాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. పోలవరానికి ఇచ్చిన నిధులు లెక్క చెప్పకుండా... పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం హాస్యాస్పదమన్నారు. పోలవరం రానే రాదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసునని చెప్పారు.
జీడీపీ పెరిగి... రెవెన్యూ గ్రోత్ తగ్గిందా
రాష్ట్రంలో జీడీపీ 12.26 శాతానికి పెరిగితే రెవెన్యూ గ్రోత్ రేట్ తగ్గడమేంటో చంద్రబాబే చెప్పాలని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన విదేశీ పెట్టుబడులు కేవలం రూ. 10 వేల కోట్లు కాగా... ఏపీకి లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదాయ వెల్లడి పథకంపైనా టీడీపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై 11 ఛార్జీషీట్లు సీబీఐ కోర్టులో ఉన్నాయని తెలిపారు. ఆస్తులు అటాచ్‌మెంట్‌లో ఉంటే అంత నల్లధనం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. వివరాలు కేంద్రం బయటపెట్టాలని, గోప్యంగా ఉంచాల్సిన విషయం బయట పెట్టినవారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో విశాఖలో ఏర్పాటు చేస్తామన్న అరుుల్ రిఫైనరీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తే జగన్‌కు మద్దతు తెలిపినట్లు అనుకోకూడదన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా విఫలమైందని చెప్పారు.