బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకో | Minister indrakaran Reddy comments on Revanth Reddy | Sakshi
Sakshi News home page

బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకో

Published Sun, Mar 5 2017 3:24 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకో - Sakshi

బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకో

రేవంత్‌రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హితవు

సాక్షి, హైదరాబాద్‌: బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం హితవు పలికారు. పేదల ఇళ్ల నిర్మాణంలో కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందనడం అవాస్తవమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరైన ఆధారాలుంటే మీడియా ముందు బహిర్గ తం చేయాలని, అనవసరంగా మాట్లాడితే పుట్టగతులుండవని హెచ్చరించారు.

పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రం వెనక్కు తగ్గదని, ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన ఘనత బాబుదేనని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement