సాక్షి, మహబూబ్‌నగర్: తమను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ రాష్ట్ర ఆరెకటిక సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి తరలుతున్న ఆరెకటికలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌జీ, రాంచందర్‌జీలు మాట్లాడుతూ దేశంలోని 19 రాష్ట్రాలలో ఆరెకటిక కులం ఎస్సీ జాబితాలో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసి ‘డి’ జాబితాలో ఉందన్నారు.
దీని కారణంగా ఆరెకటికలకు సరైన విద్య అందక, ఉద్యోగాలు రాక రాజకీయ ప్రాధాన్యం లేక వెనకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ కులాల సంక్షేమానికి వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. తమకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వెనకబాటుకు, అన్యాయానికి గురైన తమ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చి తమకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment