ముషీరాబాద్(హైదరాబాద్): సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్స వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు చేట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. ముషీరాబాద్ నియోజక వర్గంలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో అశోక్‌నగర్‌లోని ఆయన నివాసం వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తిని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును కూడా కాలరాస్తోందని విమర్శించారు. తెలంగాణ రాకముందు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆ హామీని విస్మరించారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment