ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల | telangana-unemployed-students-jac-call-for-chelo-assembly | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 17 2014 4:57 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

ఉస్మానియా యూనివర్శిటీ ఎన్సీసీ గేట్ వద్ద సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ నుంచి తార్నాక వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కేసీఆర్‌ విధానాలను నిరసిస్తూ నేడు ఉస్మానియా నిరుద్యోగ జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ వీరంతా గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement