100మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్ట్ | Police arrest MRPS activists near assembly | Sakshi
Sakshi News home page

100మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్ట్

Published Wed, Mar 18 2015 8:38 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

Police arrest MRPS activists near assembly

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముట్టడికి యత్నించిన సుమారు 100మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ బుధవారం ఛలో అసెంబ్లీకి  పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ పరిసరాల్లో ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేనందున ఆందోళనకారులను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

కాగా అసెంబ్లీ పరిసరాల్లో నేడు వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం ఎనిమిది  గంటల నుంచి మధ్యాహ్నం  రెండు గంటల వరకు ఈ నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయి. ఎమ్మార్పీఎస్ ఛలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఆ చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement