అనంతపురం(అర్బన్): ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కె.ఎస్. బాబు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడంతోపాటు ఎస్సీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీలకు ఉపాధి పనులు కల్పించాలని కోరారు.