సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలులో తక్షణ అరెస్టులు వద్దంటూ సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని సొంత పార్టీ ఎంపీల నుంచే బీజేపీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్.. రాష్ట్రపతిని కలిసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై వచ్చే వారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. సామాజిక న్యాయ శాఖతో న్యాయ శాఖ ఉన్నతాధికారులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారని, వచ్చే బుధవారం రివ్యూ పిటిషన్ వేస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరాన్ని పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించానని, వారు తగిన చర్యలు చేపడుతున్నారని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment