కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మూడు జాబితాలుగా నల్లధనం వివరాలు సమర్పించింది.
కేంద్ర ప్రభుత్వం మొత్తం 627 మంది నల్ల కుబేరుల పేర్లతో కూడిన ఓ భారీ జాబితాను సుప్రీంకోర్టుకు బుధవారం సమర్పించింది. సీల్డ్ కవర్లో జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. మొత్తం మూడు జాబితాలుగా ఈ నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ మూడు జాబితాలను అందజేశారు.
అయితే... అందులో కేవలం ఒక్క జాబితాలోనే మొత్తం నల్లధనం ఉన్నవారందరి వివరాలు ఉన్నాయి. రెండో జాబితాలో విదేశీ బ్యాంకు ఖాతాదారుల వివరాలు, మూడో జాబితాలో దర్యాప్తు పురోగతిని వివరించింది. మొత్తం జాబితా అంతా సుప్రీంకోర్టు చేతికి చేరడంతో.. ఇక నల్లధనం కేసు దర్యాప్తు ప్రక్రియ మొత్తాన్ని సుప్రీం తన స్వీయ పర్యవేక్షణలో చేపట్టబోతోంది. ఇప్పటికే ఈ అంశంపై ఏర్పాటుచేసిన 'సిట్' ఈ కేసు దర్యాప్తును స్వీకరిస్తుంది.