నల్లధనం కేసు.. ఎప్పుడేం జరిగింది? | black money case, a chronology of events | Sakshi
Sakshi News home page

నల్లధనం కేసు.. ఎప్పుడేం జరిగింది?

Published Wed, Oct 29 2014 1:07 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

నల్లధనం కేసు.. ఎప్పుడేం జరిగింది? - Sakshi

నల్లధనం కేసు.. ఎప్పుడేం జరిగింది?

విదేశీ బ్యాంకుల్లో వేల కోట్లలో సొమ్ము దాచుకున్న నల్ల కుబేరుల జాబితాను కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది.

విదేశీ బ్యాంకుల్లో వేల కోట్లలో సొమ్ము దాచుకున్న నల్ల కుబేరుల జాబితాను కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. 627మంది పేర్లతో కూడిన ఈ జాబితాను మూడు సెట్లుగా కేంద్రం సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి అందించింది. ఈ నేపథ్యంలో నల్లధనంపై దేశంలో చోటుచేసుకున్న పరిణామాల కాలక్రమం ఒక్కసారి చూద్దాం...
 

18-04-2009 : పన్ను ఎగవేసి విదేశాల్లో నల్లధనం దాచిన భారతీయుల వివరాలు విడుదల చేస్తామని బీజేపీ ఓ బుక్ లెట్ విడుదల చేసింది.

19-01-2011 : దాదాపు 89.16 బిలియన్ డాలర్ల మేర భారతీయుల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో ఉంది. ఆ ధనాన్ని వెనక్కి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని  చర్యలు తీసుకుంటుందని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు.

19-01-2011 : బ్లాక్ మనీపై ఎంసీ జోషి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీబీడీటీ కమిటీ కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది.

27-01-2012 : నల్ల కుబేరుల పేర్లు ఇచ్చిపుచ్చుకోవాలని జీ 20 దేశాలు తీర్మానించాయి. ఆ తీర్మానంపై సంతకాలు చేయాలని నిర్ణయించాయి.

14-11-2013 : తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని నాటి గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.  

01-02-2014: నల్లధనాన్ని వెనక్కి తెచ్చే విషయంలో ప్రతిపక్షాల సలహాలను తీసుకుంటామని ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు.

21-02-2014 : నరేంద్ర మోడీకి దాదాపు రూ.400 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో వెల్లడించాలని ఆప్ నాయకులు బీజేపీని డిమాండ్ చేశారు.

26-03-2014 : బ్లాక్ మనీ వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రత్యేక రాయబారిని నియమిస్తామని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది.

27-04-2014 : నల్లధనం దాచిన కుబేరుల జాబితా వివరాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో భారత్, స్విట్జర్లాండ్ దేశాలు అధ్యాయనం చేయాలని నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు.

29-04- 2014 : లిచెస్టన్ బ్యాంకులో నల్లధనం దాచిన 26 మంది వివరాలను భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది.

02-06-2014 :  విదేశాల్లో దాగి ఉన్న బ్లాక్ మనీని రప్పించేందుకు రిటైర్డు జడ్జీ ఎంబీ షా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించింది.

20-07-2014 : నల్లకుబేరుల జాబితా వివరాలు వెల్లడించాలని భారత్ చేసిన విజ్ఞప్తిపై స్విస్ బ్యాంకులు సానుకూలంగా స్పందించాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రకటన చేశారు.

25-07-2014 : బ్లాక్ మనీని వెనక్కి తీసుకురావడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. నల్లధనం సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు.

18-10-2014: నల్లకుబేరుల జాబితాలోని వారి వివరాలను దాచిపెట్టేది లేదని జైట్లీ మరోసారి అన్నారు. అయితే సమగ్ర విచారణ తర్వాత మాత్రమే వాటిని వెల్లడిస్తామన్నారు.

26-10-2014 : ఒక కంపెనీ సహా మొత్తం 8 మంది నల్లకుబేరుల వివరాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది.

28-10-2014 : నల్లకుబేరుల పూర్తి జాబితాను సీల్డ్ కవర్లో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

29-10-2014 : మొత్తం 627 పేర్లతో కూడిన జాబితాను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement