వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా బుధవారం వామపక్షాలు తలపెట్టిన చలో అసెంబ్లీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు.
వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా బుధవారం వామపక్షాలు తలపెట్టిన చలో అసెంబ్లీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టులకు మద్దతుగా కొంత మంది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరూ పాల్గొన కూడదని సూచించారు. ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ ఎన్ కౌంటర్ కి నిరసనగా 371 ప్రజాసంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టిన సంగతి తెలిందే.