
'ఈ నెల 7న అసెంబ్లీని ముట్టడిస్తాం'
హైదరాబాద్: బీసీల డిమాండ్ల సాధనకు ఈ నెల 7న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో బీసీ బిల్లుకు కేంద్రంపై రాష్ట్రప్రభుత్వాలు ఒత్తిడి తేవాలని ఆర్. కృష్ణయ్య కోరారు. బీసీలకు 10 వేల కోట్లతో సబ్ప్లాన్ అమలు చేయాలన్నారు. బీసీల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని విమర్శించారు. అందుకే అక్టోబర్ 7న అసెంబ్లీని ముట్టడిస్తామని ఆర్. కృష్ణయ్య చెప్పారు.