బేరసారాలకు ఆర్‌ కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం:కారుమూరి | R Krishnaiah Cheat Jagan Sold to Chandrababu Says YSRCP Karumuri | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బేరసారాలకు ఆర్‌ కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం:కారుమూరి

Published Wed, Sep 25 2024 1:26 PM | Last Updated on Wed, Sep 25 2024 2:51 PM

R Krishnaiah Cheat Jagan Sold to Chandrababu Says YSRCP Karumuri

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ నేతలను కొనుగోలు చేసి.. ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్‌ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై బుధవారం కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు. 

‘‘బీసీలకు వైఎస్‌ జగన్‌ ఎంతో మేలు చేశారు. రాజ్యాధికారం దక్కాలని వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కృష్ణయ్యకు పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారు. కృష్ణయ్య ద్వారా బీసీలకు మంచి జరుగుతుందని జగన్‌ అనుకున్నారు. కానీ, ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి బాబు బేరసారాలకు కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. 

.. బీసీలను కృష్ణయ్య మోసం చేశారు. ఈ ద్రోహంతో ఆర్‌ కృష్ణయ్యను తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షమించరు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన కృష్ణయ్య.. చరిత్ర హీనుడిగా మిలిపోవడం ఖాయం అని కారుమూరి అన్నారు. 

సీబీఐ అంటే ఎందుకు భయం?
జగన్‌కు ఉన్న ప్రజా ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు. అందుకే తిరుపతి లడ్డు పేరుతో తప్పుడు ప్రచారానికి దిగారు. లడ్డుపై టీటీడీ ఈవో, ఒక మాట చంద్రబాబు మరో మాట మాట్లాడుతున్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. సూపర్ సిక్స్ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసమే ఇదంతా. సీబీఐ అంటే చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారు.. లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించొచ్చు కదా అని కారుమూరి ప్రశ్నించారు.

క్షమించరాని తప్పు ఆర్.కృష్ణయ్య రాజీనామాపై కారుమూరి రియాక్షన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement