మాట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య
సీఎం జగన్‌పై హత్యాయత్నం అమానుషం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
జగ్గయ్యపేట: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గెలవలేకపోతున్నామనే అక్కసుతో హత్యాయత్నానికి పాల్పడ్డారని, మే 13న జరిగే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ఓట్ల రూపంలో కూటమి నేతలపై ప్రజాదాడి జరగనుందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సోమవారం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర నివాసంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ వస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు రాజకీయంగా, ఆరి్థకంగా ఎదిగేందుకు ఎంతో కృషి చేశారని, గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీసీలకు సముచిత స్థానం కలి్పంచిన ఘనత సీఎ వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. బీసీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు కూడా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని, అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కావాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలు ఇచ్చే తీర్పుతో ప్రతిపక్షాలు చతికిలబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సీఎం జగన్ వెంటనే బీసీలు ఉన్నారని స్పష్టంచేశారు. సామినేని ఉదయభాను మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని, రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా బీసీలకు చేసిందేమీ లేదన్నారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ‘మేమంతా సిద్ధం’ సభలకు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలకు వణుకుపుట్టి హత్యాయత్నాలు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నాన్ని ఎల్లో మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవహేళన చేసేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేబిరాణి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి పిల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment