సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలోని యూటిఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఛలో అసెంబ్లీకి వెళ్లేందుకు బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.