కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ గురువారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. యూనియన్ పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగులు పెద్దసంఖ్యలో అసెంబ్లీకి తరలివస్తున్నారు. మరోవైపు ‘చలో అసెంబ్లీ’కి అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. ఉద్యోగులను అడ్డుకోవడానికి అడుగడుగునా బలగాలను మోహరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సెక్షన్ 30తోపాటు 144 సెక్షన్ విధించారు.