కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేయాలంటూ విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు శనివారం కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సీపీఎస్ రద్దుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది ఉద్యోగులు సీపీఎస్ విధానంతో నష్టపోతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలలనుంచి వచ్చిన వేలాదిమంది ప్రతినిధులు.. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.