ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు ఉపసంహరించుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తొలిరోజే నిరసన కార్యక్రమాలు చేపట్టడం సరికాదన్నారు. ఆ రోజు ఏం జరిగినా కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే జాలేస్తోందని, సీఎల్పీ నేత జానారెడ్డి ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఏం అంశంపైన అయినా చర్చకు సిద్ధంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే జాలేస్తోంది..
Published Wed, Oct 25 2017 2:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
Advertisement