
ప్రతీకాత్మక చిత్రం
గురుగ్రామ్ : ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలిని, ఆమె కుమార్తెను రేప్ చేస్తానని అదే పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి(13) ఫేస్‌బుక్‌లో హెచ్చరించిన ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. అంతేకాకుండా అదే పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి ఒకరు మరో ఉపాధ్యాయురాలని షికారుకు వెళదామనీ, క్యాండిల్‌లైట్ డిన్నర్‌తో పాటు శృంగారంలో పాల్గొందామని ఆహ్వానించాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ రెండు ఘటనలు వారం రోజుల క్రితం చోటుచేసుకున్నాయి. అత్యాచారం చేస్తానని విద్యార్థి హెచ్చరికలతో సదరు ఉపాధ్యాయురాలు కొన్నిరోజుల పాటు పాఠశాలకు వెళ్లడం మానుకున్నారు.
చివరికి ఈ విషయం జిల్లా చిన్నారుల సంక్షేమ కమిటీ చైర్మన్ శకుంతలా ధుల్ దృష్టికి రావడంతో పాఠశాలతో పాటు టీచర్లతో అనుచితంగా ప్రవర్తించిన విద్యార్థులకు నోటీసులు జారీచేశారు. వీరిని అధికారులు త్వరలోనే ప్రశ్నించడంతో పాటు కౌన్సెలింగ్ కూడా నిర్వహించనున్నారు. మరోవైపు ఈ ఘటనలపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నట్లు సదరు స్కూల్ యాజమాన్యం తెలిపింది.
రేప్ చేస్తామని బెదిరించిన విద్యార్థిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ ఘటనపై తమకు ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదనీ గురుగ్రామ్ పోలీస్‌స్టేషన్ పీఆర్వో రవీందర్ కుమార్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment