
కరోనా మహమ్మారితో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో వారు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. పొట్ట కూటి కోసం కొందరు కులవృత్తి చేస్తుంటే.. మరికొందరు అప్పడాలు తయారీ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. – ఎలేటి శైలేందర్‌రెడ్డి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, జగిత్యాల
అప్పడాలే ఆసరాగా..
అప్పడాలు చేస్తున్న వీరంతా జగిత్యాలలోని ప్రైవేటు స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయినులు. వీరంతా కలసి అప్పడాల వ్యాపారం మొదలు పెట్టారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తాము, తమ జీవితాన్ని చక్కబెట్టుకునేందుకు ఇలా అప్పడాల వ్యాపారం మొదలుపెట్టినట్లు ప్రైవేట్ టీచర్ శ్వేత తెలిపారు.
ఎంబీఏ చదివి కార్పెంటర్‌గా..
జగిత్యాల జిల్లా కేం ద్రం శివారు అనంతారం గ్రామానికి చెందిన భరత్ ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్. ఎంబీఏ వరకు చదివిన ఆయన పదోతరగతి వరకు సోషల్ సబ్జెక్టు బోధిస్తారు. లాక్‌డౌన్‌తో బడులు మూత పడటంతో తనకు తెలిసిన కార్పెంటర్ పనిని నమ్ముకున్నాడు. ఫర్నిచర్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
టైలరింగ్ చేస్తూ..
బీఈడీ చదివిన మంజుల జగిత్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. కరోనా ప్రభావంతో విద్యాసంస్థలు మూత పడటంతో కుటుంబానికి బాసటగా నిలిచేందుకు టైలరింగ్ పనులు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment