చెరువూరు వాగు దాటుతున్న బలపం పాఠశాల ఉపాధ్యాయులు
విశాఖ, చింతపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్‌ఆర్ కంటివెలుగు పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలి దశలో ఈ నెల 15వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దసరా సెలవులు ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసినప్పటికీ మారుమూల గ్రామాల పిల్లలు నేటికీ పాఠశాలలకు చేరుకోలేదు. దీంతో ఉపాధ్యాయులు వారి కోసం గ్రామాలకు వెళుతున్నారు. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు.. గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. చింతపల్లి మండలం బలపం పాఠశాల పరిధిలోని గ్రామాల విద్యార్థులు శనివారం కూడా హాజరు కాకపోవడంతో ఉపాధ్యాయులు వారికోసం అన్వేషణ ప్రారంభించారు. ఆదివారం ఉప్పొంగి ప్రవహిస్తున్న చెరువూరు వాగును దాటి గ్రామాల్లోకి వెళ్లి పిల్లలను గుర్తించి నేత్ర పరీక్షలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment