ముకుందవరం యూపీ పాఠశాలలో వంట చేస్తున్న ఉపాధ్యాయులు
తూర్పుగోదావరి, రంగంపేట (అనపర్తి): మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిర్వాహకులు మంగళవారం విధులు బహిష్కరించి సమ్మె చేయడంతో మండలంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులే వంట మాస్టార్లుగా అవతారం ఎత్తి విద్యార్థులకు వంట చేసి వడ్డించారు. ఈ ఏజెన్సీ నిర్వాహకులు బుధవారం కూడా సమ్మెలో ఉంటారు. మండలంలోని ముకుందవరం యూపీ పాఠశాలలోని ఉపాధ్యాయులు స్వయంగా వంట చేసి విద్యార్థులకు వడ్డించారు. మండలంలోని కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాలను ఉపాధ్యాయులు, ఇతరులతో వండించారు.
మండలంలోని వెంకటాపురం, సుభద్రంపేట యూపీ పాఠశాలలు, రంగంపేట, దొడ్డిగుంట ఉన్నత పాఠశాలల్లోమాత్రం వంటలు చేయలేదు. మండలంలోని ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిర్వాహకులు కాకినాడ ధర్నాకు వెళుతున్నామని, మంగళ, బుధవారాల్లో వంటలు చేయమంటూ చెప్పడంతో ఉపాధ్యాయులు ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేశారు. సమ్మెలో పాల్గొనని కొంత మంది మాత్రం మధ్యాహ్న భోజనం తయారుచేశారు. కొన్నిచోట్ల పాఠశాల సమీపంలో ఉన్న విద్యార్థుల ఇళ్లల్లో భోజనాలు వండించారు. నాలుగు పాఠశాలల్లో మాత్రం ముందుగానే భోజనాలు తెచ్చుకోవాలని చెప్పడంతో విద్యార్థులు క్యారేజీలు వెంట తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment