పశ్చిమగోదావరి , దెందులూరు: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బ హుపరాక్.. విధులు నిర్వర్తించే సమయంలో స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్, ఫేస్‌బుక్ ఓపెన్ చేయడం, ఫోన్ సంభాషణ చేస్తే చర్యలు తప్పవు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ప్రవేశించే ముందుకు ఫోన్‌లు రిసెప్షన్‌లో పెట్టి సాయంత్రం, భోజన విరామ సమయాల్లో మాత్రమే వినియోగిస్తారు. బోధనా సమయంలో వీటికి దూరంగా ఉంటున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవే ట్ సంస్థల యాజమాన్యాలు ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం తూతూమంత్రంగానే అమలవుతోంది. ఉపాధ్యాయులు ఫోన్‌లలో మాట్లాడుతూనే ఉంటున్నారు.
ఎవరినుంచి ఏ మెసేజ్ వస్తుందో.. ఎప్పుడు ఫోన్‌కాల్ వస్తుందో అన్న ఆతృతతో పలువురు ఉపాధ్యాయులు ఫోన్‌లపై అధికంగా దృష్టి సారిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులైతే ఏకంగా రెండు ఫోన్‌లను జేబులో పెట్టుకు ని తరగతి గదులకు తీసుకువెళ్లటం గమనార్హం. ఇలా జరిగితే ఉపాధ్యాయులకు విద్యాబోధనపై ఆసక్తి సన్నగిల్లుతుందని, తద్వారా విద్యార్థుల భవిష్యత్ కుంటుపడే ప్రమాదం ఉందని జిల్లావ్యాప్తంగా తల్లిదండ్రులు, సంఘ సేవలకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాఠశాలల పనివేళల్లో ఫోన్ వినియోగించరాదని, వాట్సప్, ఫేస్‌బుక్ ఓపెన్ చేయకుండా చూడాల ని డీఈఓలకు పక్కాగా ఆదేశాలు జారీచేసింది. ఈనేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనా సమయంలో సెల్‌ఫోన్‌లను విని యోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆయా ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. బోధనా సమయంలో సెల్‌ఫోన్‌లు సైలెంట్ మోడ్‌లో పెట్టాలి. భోజన విరామ సమయంలో వినియోగించుకోవచ్చు. బోధనా సమయంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సెల్‌ఫోన్‌లను వినియోగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– సీవీ రేణుక, జిల్లావిద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment