ఫేస్బుక్ మరో సరికొత్త యాప్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖసోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ మరో యాప్ ను రిలీజ్ చేసింది. స్థానికంగా జరిగే విషయాలను తెలుసుకొని,ముఖ్కమైనవి మిస్ కాకుండా.. వాటి గురించి తెలుసుకొని స్నేహితులు, కలీగ్స్ పరస్పరం ఎంజాయ్ చేసేలా స్మార్ట్ ఫోన్ కోసం 'ఈవెంట్స్ యాప్' పేరుతో ఈ సరికొత్త యాప్ విడుదలచేసింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ప్రొడక్ట్ మేనేజర్ ఆదిత్య కూల్ వాల్ ఒక పోస్ట్ లో వెల్లడించారు.
ఈ యాప్ సహకారంతో సాహిత్య సమావేశాలు, నాటికలు లాంటి ఇతర ఆసక్తికరమైన కార్యక్రమాలను గురించి, ప్రదేశము, ఆసక్తి తదితర అంశాల ఆధారంగా ఒకరికొకరు పంచుకునేందుకు ఉపయోగపడునుందని తెలిపారు. ఈవెంట్స్ ను ఓపెన్ చేయగానే కొత్త కార్యక్రమాల వివరాలు మీకు అందుతాయనీ, ఆల్ రెడీ కనెక్ట్ అయి వున్న ఈ యాప్ క్లిక్ చేయగానే మీ స్నేహితుల లేటెస్ట్ ఈవెంట్స్ సంబంధించిన వివరాలు, పేజీలు, లైక్స్ తదితర అంశాలు తెలుస్తాయని కూల్ వాల్ తెలిపారు.
యాప్‌లో పుట్టినరోజు, సమావేశాలు, గ్రూప్ మీటింగ్స్, ఎగ్జిబిషన్స్ వంటి ఈవెంట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చన్నారు. తక్కువ సమయంలో మిత్రులందరికీ సమాచారం అందించడంతో పాటు ఈవెంట్‌ని గురించి ప్రచారం కూడా చేసుకోవచ్చని కూల్ పేర్కొన్నారు.