Physics Wallah Caught in Controversy as Ex-teachers Cry on Camera - Sakshi
Sakshi News home page

Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు!

Published Sun, Mar 26 2023 6:10 PM | Last Updated on Sun, Mar 26 2023 6:28 PM

physics wallah ex teachers cry on youtube - Sakshi

ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ ఫిజిక్స్ వాలాను వీడిన ముగ్గురు టీచర్లు తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ  సానుభూతి కోసం ఏడుస్తూ పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం బాగా వైరల్‌ అయింది. వారి ఏడుపు టీవీ నాటకంలా ఉందని నెటిజన్లు ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు.

ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్!

‘ఫిజిక్స్ వాలా’లో పనిచేస్తున్న తరుణ్ కుమార్, మనీష్ దూబే, సర్వేష్ దీక్షిత్ అనే ముగ్గురు టీచర్లు.. సంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండేతో విభేదాల కారణంగా ఇటీవల ఆ సంస్థను విడిచి బయటకు వెళ్లారు. అయితే అడ్డా247 అనే సంస్థ నుంచి రూ.5 కోట్లు తీసుకుని ‘ఫిజిక్స్ వాలా’ను వీడినట్లు ఆ సంస్థ కెమిస్ట్రీ టీచర్ తమపై ఆరోపణలు చేశారని ముగ్గురూ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గ్యాస్‌ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన!

రాజీనామా తర్వాత ముగ్గురు ఉపాధ్యాయులు ఇప్పుడు సంకల్ప్ అనే పేరుతో వారి సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఫిజిక్స్ వాలాపై విమర్శలు చేస్తూ తమ ఛానెల్‌లో ఓ వీడియో పెట్టారు. తమపై ఆరోపణలు చేయడంపై విరుచుకుపడ్డారు. ఓ దశలో బోరుమంటూ ఏడ్చేశారు. అయితే వీరికి కొంతమంది నెటిజన్లు సానుభూతి తెలపగా ఇదంతా టీవీ నాటకం లాగా ఉందని చాలామంది విమర్శలు చేశారు. ఈ  వీడియోను కేవలం ఒక్కరోజులోనే 2.1 మిలియన్ల మంది వీక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement