సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే బుద్ధిమాలిన పనికి పాల్పడ్డారు. ప్రేమికుల రోజున 13 ఏళ్ల బాలికకు రోజాపువ్వు ఇచ్చి ఐలవ్‌యూ చెప్పి పెళ్లి చేసుకుందామని చెప్పిన ఉపాధ్యాయుడు, బాలికను బెదిరింపులకు గురిచేసి సహకరించిన మరో ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు కటకటాల వెనక్కునెట్టారు.
తమిళనాడులో చోటుచేసు కున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విల్లుపురం జిల్లా చిన్నసేలం సమీపం మేల్‌నారియప్పనూ రులో పునిత ఆంథోని ఉన్నత పాఠశాలలో నిర్మల్ (48), లారెన్స్, జాన్ ఫ్రాన్సిస్ అనే ఉపాధ్యాయులు ఈనెల 14న ప్రేమికులరో జు జరుపుకున్నారు. అదే పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థిని (13)ని పాఠశాలలోని తన గదికి పిలిపించుకుని రోజా పువ్వు చేతిలో పెట్టి ‘నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వూ ప్రేమించు, పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాడు.
దీంతో బాలిక ఏడుస్తూ క్లాసురూంకు వచ్చింది. ఉపాధ్యాయులు లారెన్స్, జాన్ ఫ్రాన్సిస్‌లకు చెప్పుకుని కన్నీరు పెట్టుకుంది. నిర్మల్ చేష్టలను ఖండిచాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు బాలికనే బెదిరించారు. బాలిక ఏడుస్తూనే ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పుకుంది. బాలిక తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఏకమై పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment