సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆ ఉపాధ్యాయుల మాటే .. ఓ విద్యార్థికి ప్రాణం నిలబడేటట్లు చేసింది. పాఠాలు చెప్పడమే కాదు..మనస్ఫూర్తిగా తలుచుకుంటే ప్రాణాలు సైతం పోయగలరని నిరూపించారు. ఆస్పత్రిలోని వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పుదుక్కోట్టై గంధర్వపేటలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో అరుణ్‌పాండియన్ (17) అనే విద్యార్థి ప్లస్ టూ చదువుతున్నాడు. మిన్నాత్తూరు అనే గ్రామం నుంచి రోజూ బస్సు లో వచ్చి వెళుతుంటాడు.
ఈనెల 17వ తేదీన పాఠశాల ముగియగానే తోటి విద్యార్థులతో కలసి ఆడుకుని.. బస్టాండుకు చేరుకున్న అరుణ్ పాండియన్ కొద్ది నిమిషాల్లోనే స్పృహతప్పి పడిపోయాడు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర చికిత్సను అందజేసి మెరుగైన చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి నాడి చాలా బలహీనంగా కొట్టుకుం టోంది, కొద్ది నిమిషాల్లో కోమాలోకి వెళ్లిపోతాడని చెప్పారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న విద్యార్థి అరుణ్‌ను ఉపాధ్యాయులు మణికంఠన్, సోమ సుందరం ఈ నెల 18న చూసేందుకు వెళ్లారు.
ముఖానికి ఆక్సిజన్ మాస్క్ అమర్చి ఉండగా, కంటి గుడ్లు పైకి తేలవేసి, చలనం లేని స్థితిలో ఉన్న విద్యార్థిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరు టీచర్లు విద్యార్థి చెవివద్దకు వెళ్లి ‘తంబీ కన్ ముళిచ్చిపార్, యార్ వందిరిక్కిరోం’ (తమ్ము డూ కళ్లు తెరిచి చూడు.. ఎవరొచ్చారో) అంటూ అదేపనిగా పలకరించడం ప్రారంభించారు. కదలికలేకుండా ఉండిన కనురెప్పలు కొట్టుకోవడం ప్రారంభిం చాయి, కనుగుడ్లు కదలసాగాయి. శరీరంలో చలనం మొదలైంది.
ఈ మార్పును గమనించిన టీచర్లు మరింతగా రెట్టించి ‘ఉనక్కు ఒన్రుం ఇల్లై నాంగళ్ ఇరుక్కి రోం’ (నీకేమీ కాలేదు, మేమున్నాం) అని పదే పదే ధైర్యం నూరి పోయగా విద్యార్థి పూర్తిగా స్పృహలోకి వచ్చి మాట్లాడటం ప్రారంభించాడు. అరుణ్ కోలుకోవ డాన్ని చూసి పక్కనే ఉన్న వైద్యులు సంభ్రమా శ్చర్యాలకు గురికాగా, తల్లిదండ్రులు ఆనందపడి పోయారు. సినిమాల్లో మాత్రమే జరిగే ఇలాంటి దృశ్యాన్ని నేరుగా చూడగలిగామని వైద్యులు ఉపాధ్యాయులను ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment