ప్రియుడిని తాళ్లతో బంధించి రెచ్చిపోయిన కామాంధులు | Tamil Nadu mass rape of student | Sakshi
Sakshi News home page

ప్రియుడిని తాళ్లతో బంధించి రెచ్చిపోయిన కామాంధులు

Published Sun, Jul 20 2014 3:20 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

ప్రియుడిని తాళ్లతో బంధించి రెచ్చిపోయిన కామాంధులు - Sakshi

ప్రియుడిని తాళ్లతో బంధించి రెచ్చిపోయిన కామాంధులు

  • తమిళనాడులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
  •  ప్రియుడిని తాళ్లతో బంధించి  రెచ్చిపోయిన కామాంధులు
  •  నగ్నంగా ఫొటోలు తీయించుకున్న వైనం
  •  కృష్ణగిరి : తమిళనాడులో కామాంధులు చెలరేగిపోయారు. ఓ కళాశాల విదార్థినిపై ప్రియుడి ఎదుటే నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఊరుకోకుండా ఆమెను నగ్నంగా మార్చి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన కృష్ణగిరి జిల్లా రాయకోట సమీపంలోని బోడంపట్టి గ్రామం వద్ద  శుక్రవారం సాయంత్రం చోటు చేసుకొంది.

    ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి  తీసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాలు..  కృష్ణగిరి జిల్లా కావేరిపట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(19) కృష్ణగిరిలోని ఓ కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతుంది. కావేరిపట్టణం సమీపంలోని మరో గ్రామానికి చెందిన యువకుడు (24), ఆ యువతి ప్రేమించుకున్నారు.

    వీరిరువురూ శుక్రవారం సాయంత్రం కారులో రాయకోట సమీపంలోని బోడంపట్టికి వెళ్లారు. అక్కడ ఏకాంతంగా ఉండగా  రాయకోట హెచ్చంపట్టికి చెందిన సుబ్రమణి(28), రాఘవేంద్రనగర్‌కు చెందిన  ప్రకాష్(24), రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మణి(22), గిడ్డంబట్టికి చెందిన  ప్రకాష్(24) అక్కడికి చేరుకొని ప్రియుడిపై దాడిచేశారు. చేతులు, కాళ్లు,కట్టిపడేసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

    అనంతరం ఆ యువతిని బెదిరించి నగ్నంగా ఫొటోలు తీయించుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన పశువుల కాపరి బోడంపట్టి సెల్లప్ప గ్రామస్తులకు సమాచారం అందజేశాడు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఘటనా స్థలానికి చేరుకోగా నిందితులు అప్పటికే ఉడాయించారు. అనంతరం ఆ ప్రేమికులను రాయకోట పోలీసులకు అప్పగించగా వారిని కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    అనంతరం రాత్రికి రాత్రే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని  విచారణ చేపట్టారు. డీజీఐ అముల్‌రాజ్, జిల్లా ఎస్పీ కణ్ణమ్మాళ్, డెంకణీకోట  డీఎస్పీ రాధాకృష్ణన్, సీఐ పురుషోత్తమన్  శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత యువతి, యువకుడు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం, అత్యాచారానికి పాల్పడిన వారు కూడా మరో సామాజిక వర్గాలకు  చెందిన వారు కావడంతో కుల ఘర్షణలకు దారితీస్తుందనే అనుమానంతో జిల్లాలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement