
వేలూరు: తిరుపత్తూరు జిల్లా జవ్యాది కొండ సమీపంలో వివాహితపై నలుగురు యువకులు కలిసి అత్యాచారం చేసిన సంఘటన సంచలనం రేపింది. జవ్యాది కొండ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు. ఇతను బెంగళూరులో ఉంటూ పనిచేస్తున్నాడు. ఇతని భార్య ఒంటరిగా గ్రామంలో నివశిస్తోంది. మంగళవారం సాయంత్రం ఆ మహిళ ఇంటి సమీపంలోని పొలం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన అలగేశన్, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు.
వెంటనే ఆమెను నలుగురు కలిసి సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. అయితే గంటల తరబడి వివాహిత ఇంటికి రాక పోవడంతో ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న బంధువులు ఆమెను గాలించారు. ఆ సమయంలో వివాహిత ఒక ముళ్ల పొదల్లో స్పృహ తప్పి పడి ఉండడాన్ని గమనించి తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. స్పృహ వచ్చిన అనంతరం ఆమె తనను నలుగురు యువకులు కలిసి అత్యాచారం చేసినట్లు తెలిపింది. వీటిపై బంధువులు తిరుపత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment