ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ జారీ చేస్తూ ప్రభుత్వం సంచన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఈ మేరకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్ట్‌లు, లెగ్గింగ్స్ ధరించకుండా నిషేధించేలా ఒక కొత్త నిబంధనను జారీ చేస్తు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైతే బోధన, క్రమశిక్షణ పరంగా వస్త్రధారణ ఆదర్శంగా ఉండాలని చెప్పింది.
ఉపాధ్యాయులు విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదపూర్వక హోదాలో ఉంటారు కాబట్టి డ్రెస్ కోడ్‌ని అనుసరించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అస్సాంలోని అని విద్యాశాఖల్లోని పురుష, మహిళా ఉపాధ్యాయులు లెగ్గింగ్‌లు, జీన్స్‌లు, టీ షర్ట్‌లు ధరించొద్దని కోరింది. కొందరూ ఉద్యోగులు తమకు నచ్చిన దుస్తులను ధరించి పాఠశాలలకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పబ్లిక్ కూడా చాలా వరకు దీన్ని ఆమెదించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
బోధనా సమయంలో ఉపాధ్యాయులు తమ వృత్తికి తగ్గట్టుగా గంభీరత ప్రతిబింబించే దుస్తులు ధరించే కోడ్ అవసరమని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పాఠశాల విద్యాశాఖ పేర్కొన్న నిబంధనను అందరూ కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలకు తీసుకోవడం జరుగుతుందని అస్సాం ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు మాట్లాడుతూ..అస్సాం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠశాల నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని ప్రవేశపెట్టనుంది. అందులో పాఠశాలను ఎలా నిర్వహించాలి, తరగతులు ఏవిధంగా నిర్వహించాలి వంటి వాటి తోపాటు ఉపాధ్యాయుల డ్రస్ కోడ్, పిల్లల యూనిఫాంకి సంబంధించిన రూల్స్ ఉంటాయని చెప్పారు.
(చదవండి: పిల్లలకు స్మార్ట్ ఫోన్‌లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈ ..)
Comments
Please login to add a commentAdd a comment